Girija: నాగార్జునతో రికార్డ్ లిప్ లాక్ పెట్టిన హీరోయిన్.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిందేంటి
ABN , Publish Date - Aug 18 , 2025 | 06:59 PM
ఎన్ని సినిమాలు చేసినా నటుడుకు ఒక సినిమా అనేది కెరీర్ లో గుర్తుండిపోతుంది. ముఖ్యంగా హీరోయిన్స్.. ఒకే ఒక్క సినిమా ఎన్నేళ్ళైనా కూడా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉండేలా చేస్తుంది. అలా ఒక్క సినిమాతోనే తెలుగువారి గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది గిరిజ (Girija).
Girija: ఎన్ని సినిమాలు చేసినా నటుడుకు ఒక సినిమా అనేది కెరీర్ లో గుర్తుండిపోతుంది. ముఖ్యంగా హీరోయిన్స్.. ఒకే ఒక్క సినిమా ఎన్నేళ్ళైనా కూడా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉండేలా చేస్తుంది. అలా ఒక్క సినిమాతోనే తెలుగువారి గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది గిరిజ (Girija). అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) హీరోగా మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం గీతాంజలి(Geetanjali). ఈ సినిమాతోనే గిరిజ ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ సినిమాలో గిరిజ నటనకు ఫిదా కానీ ఫ్యాన్స్ లేరు అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా నాగ్ తో ఓం నమః సాంగ్ లో దాదాపు 3 నిమిషాలకు పైగా లిప్ లాక్ పెట్టి రికార్డ్ క్రియేట్ చేసిన ఘనత గిరిజకే దక్కుతుంది.
ఇక ఈ సినిమా తరువాత టాలీవుడ్ లో గిరిజ స్టార్ హీరోయిన్ గా ఏలేస్తుంది అనుకున్నారు. కానీ, ఈ సినిమా తరువాత గిరిజ పలు సినిమాల్లో నటించింది. కానీ, ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. ఇక ఆ తరువాత ఇండస్ట్రీకి దూరమైన గిరిజ ఏమైందో.. ఎక్కడుందో ఎవరికి తెలియలేదు. సోషల్ మీడియా వచ్చాక మధ్య మధ్యలో గిరిజ కనిపిస్తూ వచ్చింది. ఈమధ్యనే జగపతి బాబు జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షో ప్రారంభించడం, అందులో మొదటి గెస్ట్ గా నాగార్జున రావడం జరిగింది. ఇక ఈ షోలో నాగ్ కు జగ్గు ఒక స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చాడు.
గీతాంజలి హీరోయిన్ అయిన గిరిజ వీడియో బైట్ ను వినిపించాడు. అందులో గిరిజ అప్పటిలా అస్సలు లేదు. అసలు ఆమె గిరిజ అంటే గుర్తుపట్టలేము అని చెప్పొచ్చు. ముఖం అంతా ముడతలు పడిపోయి, ముసలిదానిలా కనిపించింది. నాగ్ మాత్రం 66 ఏళ్ళ వయస్సులో కూడా కుర్ర హీరోలా కనిపించాడు. ఇక ఈ వీడియో బైట్ లో నాగ్ గురించి గిరిజ చాలా గొప్పగా చెప్పుకొచ్చింది. తన మొదటి సినిమా నాగ్ తో చేయడం ఎంతో అదృష్టమని, సినిమా రిలీజ్ అయ్యాక తన నటన గురించి నాగ్ పొగిడారని, నాగార్జున లెజెండ్ కు ఏ మాత్రం తక్కువ కాదని చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియో బైట్ తరువాత జగ్గు భాయ్.. గిరిజ మారిపోయింది కానీ నువ్వింకా మారలేదు అని సరదాగా కామెంట్ చేశాడు. ప్రస్తుతం గిరిజ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
Kota Srinivasarao: కోట శ్రీనివాసరావు భార్య మృతి
Suriya: సూర్య - వెంకీ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ హీరో..