National Awards: తెలుగు సినిమా సత్తా చాటారు.. ఎంతో గర్వకారణం..
ABN , Publish Date - Aug 02 , 2025 | 02:09 PM
ఈసారి నేషనల్ అవార్డ్సులో తెలుగు సినిమా సత్తా చాటింది. శుక్రవారం ప్రకటించిన 71వ జాతీయ పురస్కారాల్లో టాలీవుడ్‌కు భగవంత్ కేసరి, హనుమాన్, బేబీ, బలగం, గాంధీ తాత చెట్టు చిత్రాలు పలు విభాగాల్లో అవార్డులు దక్కాయి. అవార్డులు దక్కించుకున్న అందరికీ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
ఈసారి నేషనల్ అవార్డ్సులో (National awards) తెలుగు సినిమా సత్తా చాటింది. శుక్రవారం ప్రకటించిన 71వ జాతీయ పురస్కారాల్లో టాలీవుడ్‌కు భగవంత్ కేసరి, హనుమాన్, బేబీ, బలగం, గాంధీ తాత చెట్టు చిత్రాలు పలు విభాగాల్లో అవార్డులు దక్కాయి. అవార్డులు దక్కించుకున్న అందరికీ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Mega star Chiranjeevi) అవార్డు ఎంపికైన అందరికీ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ‘71వ జాతీయ అవార్డు విజేతలకు హృదయపూర్వక అభినందనలు. ఈ పురస్కారాల్లో మన తెలుగు సినిమా మరోసారి సత్తా చాటింది. అందరికీ శుభాకాంక్షలు అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
విశ్వనాయకుడు కమల్ హాసన్ కూడా అవార్డులకు ఎంపికైన వారిని అభినందించారు. ‘అభినందనలు షారుక్‌ఖాన్.. ప్రపంచ సినిమా ఇండస్ట్రీలో మీరు ఎంతో ప్రభావాన్ని చూపారు. ఈ మధ్యకాలంలో నా హృదయాన్ని కదిలించిన చిత్రం 12 ఫెయిల్. దీనికి అవార్డు ప్రకటించి ఎంతోమందిలో స్ఫూర్తి నింపారు. విక్రాంత్ మాస్సేతోపాటు చిత్ర బృందానికి అభినందనలు. ఉత్తమ నటిగా ఎంపికైన రాణీముఖర్జీకి శుభాకాంక్షలు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
‘బాలయ్య, అనిల్‌తోపాటు ‘భగవంత్ కేసరి’ చిత్ర బృందానికి అబి?నందనలు. అవార్డులు సొంతం చేసుకున్న వారందరికీ శుభాకాంక్షలు. ఎంతో గర్వంగా ఉంది’
- వెంకటేశ్
‘71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా మన భాషకు, పరిశ్రమకు మరోసారి గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చింది. మన సంస్కృతి సినిమాల రూపంలో ఎప్పటికీ జీవించే ఉంటుంది. ఈ అవార్డులు వ్యక్తిగత గుర్తింపు మాత్రమే కావు. ఇవి తెలుగు సినిమా సమగ్రతను, దాని శక్తిని, ఆత్మను, స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. మన పరిశ్రమ తో పాటు ప్రతిభావంతులైన కళాకారులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం నాకెంతో ఆనందంగా ఉంది. విజేతలకు నా ఆశీస్సులు, అభినందనలు. తెలుగు సినిమా మరెన్నో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి’’ అని ఆశిస్తున్నా’’ అని మోహన్‌బాబు పోస్ట్ చేశారు.