సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Anil Sunkara: సరిలేరు నీకెవ్వరుకు కొవిడ్ దెబ్బ...

ABN, Publish Date - Aug 18 , 2025 | 08:30 AM

ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర (Anil Sunkara) మిత్రులతో కలిసి ఇంతవరకూ మహేశ్ బాబు (Mahesh Babu) తో నాలుగు సినిమాలు నిర్మించారు. ఈ చిత్రాలన్నీ తనకు భిన్నమైన అనుభవాలు అందించాయని తెలిపారు. మహేశ్‌ తో ఉన్న అనుబంధం జయాపజయాలకు అతీతమైందని ఆయన అన్నారు.

Mahesh babu movies

ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర (Anil Sunkara) మిత్రులతో కలిసి ఇంతవరకూ మహేశ్ బాబు (Mahesh Babu) తో నాలుగు సినిమాలు నిర్మించారు. ఈ చిత్రాలన్నీ తనకు భిన్నమైన అనుభవాలు అందించాయని తెలిపారు. మహేశ్‌ తో ఉన్న అనుబంధం జయాపజయాలకు అతీతమైందని ఆయన అన్నారు. విదేశాల్లో వ్యాపార రంగంలో పేరు తెచ్చుకున్న అనిల్ సుంకర సినిమా నిర్మాణం మీద పేషన్ తో ఇండియాలో చిత్ర నిర్మాణాన్ని మొదలు పెట్టారు. ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ను స్థాపించారు. తన మిత్రులు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటతో కలిసి మహేశ్‌ బాబు హీరోగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో 2011లో 'దూకుడు' (Dookudu) సినిమా నిర్మించారు. ఇది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీ ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని అస్సలు తాము ఊహించలేదని అన్నారు. తమ అంచనాలను మించి 'దూకుడు' ఘన విజయం సాధించిందని, ఆ సినిమా షూటింగ్ జరిగిన ప్రతి రోజు తమకు ఓ మెమొరబుల్ డే అని అన్నారు. 'దూకుడు' విజయంతో మహేశ్ బాబు ఈ ముగ్గురు నిర్మాతలు మరింత సన్నిహితులు అయిపోయారు.


'దూకుడు' తర్వాత మూడేళ్ళకు ఈ ముగ్గురు నిర్మాతలే సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో 'వన్: నేనొక్కడినే' (1: Nenokkadine) సినిమా నిర్మించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే విడుదలకు ముందు మాత్రం సూపర్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా గురించి అనిల్ చెబుతూ, 'వన్ : నేనొక్కడినే' మంచి సినిమా. అయితే ఆ కథ గురించి ప్రేక్షకులను ముందే ప్రిపేర్ చేసి ఉంటే మరింత విజయం సాధించి ఉండేది. ఆ విషయంలో మేం ఫెయిల్ అయ్యాం' అని అన్నారు. అదే యేడాది వచ్చిన 'ఆగడు' మూవీ గురించి చెబుతూ, 'మహేశ్ బాబు - శ్రీను వైట్ల కాంబినేషన్ కు తిరుగులేదు. ఆ విషయం 'దూకుడు' సక్సెస్ నిరూపించింది. దాంతో మేం కూడా కాస్తంత రిలాక్స్ అయ్యాం. తప్పకుండా హిట్ కొడతామనే ధీమాతో ఉన్నాం. నిజానికి 'ఆగడు' (Aagadu) సినిమా మొదటి మూడు రోజులు సూపర్ డూపర్ కలెక్షన్స్ వసులు చేసింది. సరిగ్గా నాలుగో రోజు బొమ్మ తిరగబడింది. ఇది మేం అస్సలు ఊహించనిది' అని అన్నారు.


మహేశ్ బాబుతో నాలుగో సినిమా 'సరిలేరు నీకెవ్వరు' (Sarileru Neekevvaru) ను దిల్ రాజుతో కలిసి అనిల్ సుంకర సోలోగా నిర్మించారు. ఈ మూవీ గురించి ఆయన చెబుతూ, 'మహేశ్ బాబుతో నాకు ఉన్న అనుబంధం ముందు చెప్పినట్టు జయాపజయాలకు అతీతమైంది. 'ఆగడు' సినిమా ఫస్ట్ హాఫ్‌ కు రచన చేసి అనిల్ రావిపూడి చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. అది మహేశ్ బాబు కు చెబితే గో ఎ హెడ్ అన్నారు. అలా ఆ సినిమా పట్టాలెక్కింది. సంక్రాంతికి మహేశ్ బాబు సినిమాలు బాగా ఆడతాయి. అలా ఆ యేడాది సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' మంచి కలెక్షన్స్ రాబట్టింది. బయ్యర్లు, ఎగ్జిబిటర్స్ అందరూ లాభాలు పొందారు. మాకు మరిన్ని లాభాలు, ఓవర్ ఫ్లోస్ వస్తాయని అనుకున్న సమయంలో కొవిడ్ దెబ్బ కొట్టేసింది. దాంతో ఆ సినిమా మేం ఆశించిన అదనపు లాభాలను తెచ్చిపెట్టలేదు' అని అన్నారు.

తాను ఎంతోమంది హీరోలతో గడిచిన పాతికేళ్ళలో సినిమాలు తీశానని, ఏ హీరో తనను ఇబ్బంది పెట్టలేదని అనిల్ సుంకర తెలిపారు. అందరూ హీరోలు తనకు ఎంతో సహకరించారని, అయితే ఒక్కోసారి తన సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయని, దానికి రకరకాల కారణాలు ఉన్నాయని చెప్పారు.

Also Read: Monday Tv Movies: సోమ‌వారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే తెలుగు సినిమాలివే

Also Read: Nikesha Patel: పులి పాప గుర్తుందా.. ఇప్పటికీ అమ్మడి అందాన్ని కొట్టేవారే లేరబ్బా

Updated Date - Aug 18 , 2025 | 08:30 AM