Anil Sunkara: భోళా శంకర్ ప్లాప్.. క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు
ABN , Publish Date - Aug 17 , 2025 | 04:58 PM
టాలీవుడ్ స్టార్ నిర్మాతల్లో అనిల్ సుంకర (Anil Sunkara) ఒకరు. AK ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై మంచి మంచి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ బ్యానర్ నుంచి వచ్చిన ప్రతి సినిమా పరాజయాన్ని అందుకుంటుంది.
Anil Sunkara: టాలీవుడ్ స్టార్ నిర్మాతల్లో అనిల్ సుంకర (Anil Sunkara) ఒకరు. AK ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై మంచి మంచి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ బ్యానర్ నుంచి వచ్చిన ప్రతి సినిమా పరాజయాన్ని అందుకుంటుంది. కొన్ని సినిమాలు అయితే వివాదాల బారిన కూడా పడుతుంది. ఈ బ్యానర్ నుంచి వచ్చి ఏజెంట్ సినిమా ఎన్ని వివాదాలను ఎదుర్కొన్నదో అందరికీ తెల్సిందే. ఇక భోళా శంకర్ (Bhola Shankar) సినిమా వలన అయితే అనిల్ సుంకర భారీ నష్టాలను చవిచూశాడు. తాజాగా ఒక ప్రెస్ మీట్ లో భోళా శంకర్ రిజల్ట్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాను షేక్ చేసింది.
అనిల్ సుంకర ప్రస్తుతం ఒక రియాల్టీ షోను నిర్వహిస్తున్నాడు. ఈ షో లాంచ్ శనివారం గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ వేడుకలో అనిల్ సుంకర తనకు ఎదురైన ఒక విచిత్రమైన సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. సినిమాలు ఆడకపోతే తానేం చేస్తాను అని.. ఒక రీమేక్ సినిమా ఆడకపోయేసరికి ఒక క్లర్క్ తనను చూసి జాలిపడ్డట్లు ఆయన చెప్పుకొచ్చాడు. 'ఒక సినిమా ప్లాప్ అయితే అసలు ఈ సినిమా కథ మేకర్స్ వినే తీశారా.. ? అసలు కథ వినకుండా సినిమా ఎందుకు చేస్తారు అని అడుగుతుంటారు. నేనొకసారి ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీస్ కి వెళ్లాను. అక్కడ నన్ను చూసి ఒక క్లర్క్ జాలి పడ్డాడు. ఎందుకండీ అసలు స్టోరీ లేని సినిమాలు తీస్తారు అని అడిగాడు. అతడికి అది రీమేక్ అని చెప్పినా అర్ధం కాలేదు. రీమేక్ సినిమా ఆడకపోతే నేనేం చేస్తాను' అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక అనిల్ సుంకరపై మెగాస్టార్ అభిమానులు మండిపడుతున్నారు. ఆయనకు చాలా ప్లాప్ లు వచ్చాయని.. ఇలా అందరిముందు భోళా శంకర్ గురించి మాత్రమే మాట్లాడడం బాగోలేదని కామెంట్స్ పెడుతున్నారు. చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023 లో రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకుంది. తమిళ్ లో భారీ విజయాన్ని అందుకున్న వేదాళం సినిమాకు రీమేక్ గా భోళా శంకర్ తెరకెక్కింది. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత చిరుపై కూడా ట్రోల్స్ వచ్చాయి. ఇలాంటి సినిమా ఎందుకు చేశారు అని చిరును కూడా విమర్శించారు.
Vijay Devarakonda: 43వ 'ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పెరేడ్' లో
Maareesan: ఓటీటీకి వచ్చేస్తున్న ఫహాద్ ఫాజిల్ కొత్త సినిమా .. ఎందులో చూడొచ్చంటే