Nikesha Patel: పులి పాప గుర్తుందా.. ఇప్పటికీ అమ్మడి అందాన్ని కొట్టేవారే లేరబ్బా
ABN , Publish Date - Aug 17 , 2025 | 07:08 PM
పవర్ స్టార్.. ప.. ప.. పవర్ స్టార్ అంటూ పులి సినిమాలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో కలిసి డ్యాన్స్ లు వేసిన నికీషా పటేల్ (Nikesha Patel) గుర్తుందా.. ? ఏం మాట్లాడుతున్నారు.
Nikesha Patel: పవర్ స్టార్.. ప.. ప.. పవర్ స్టార్ అంటూ పులి సినిమాలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో కలిసి డ్యాన్స్ లు వేసిన నికీషా పటేల్ (Nikesha Patel) గుర్తుందా.. ? ఏం మాట్లాడుతున్నారు. అసలు అంతటి అందాన్ని ఎవరైనా మర్చిపోగలరా అంటారా. నిజమే అమ్మడి అందానికి ఆ రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. మొదటి సినిమాతోనే అమ్మడు స్టార్ హీరోయిన్ హోదాను అందుకుంటుందని అనుకున్నారు. అయితే అనుకున్నది ఒక్కటి.. అయ్యింది మరొకటి. మొదటి సినిమా తరువాత నికీషా టాలీవుడ్ లో అడ్రెస్స్ లేకుండా పోయింది.
కొమరం పులి ఇచ్చిన డిజాస్టర్ తో నికీషా టాలీవుడ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇక తెలుగు అంతగా వర్క్ అవుట్ కాలేదని కన్నడకు చేరింది. అక్కడ కూడా ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేదు. అలా ప్రతి ఇండస్ట్రీలో పాగా వేయడానికి నికీషా పడని కష్టం అంటూ లేదు. బాలీవుడ్ లో అడపాదడపా కనిపిస్తూ మెప్పిస్తున్న నికీషా సోషల్ మీడియాలో ఒక సపరేట్ గుర్తింపునే దక్కించుకుంది. ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ భామ.. ఇప్పుడు బక్కచిక్కి మరింత అందంగా కనిపిస్తుంది.
నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్న నికీషా తాజాగా మరోసారి తన అందంతో ఇంటర్నెట్ ను హీట్ ఎక్కించింది. గోల్డ్ కలర్ లెహంగాలో అమ్మడు అచ్చ తెలుగు ఆడపడుచులా ఎంతో అందంగా కనిపించింది. అసలు హీరోయిన్ గా వచ్చిన కొత్తలో ఎలా అయితే తన లుక్స్ తో మెస్మరైజ్ చేసిందో.. ఇప్పుడు కూడా అదే అందంతో మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా నాభి అందాలను ఎరగా వేసి కుర్రాళ్లకు పిచ్చెక్కించింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఊరుకుంటారా.. ? సోషల్ మీడియాలో అమ్మడి ఫోటోలను వైరల్ చేసి పడేశారు. ప్రస్తుతం నికీషా ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Anil Sunkara: భోళా శంకర్ ప్లాప్.. క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు
The Bads of Bollywood: ఆర్యన్ ఖాన్ ఫస్ట్ మూవీ గ్లింప్స్