Anil Sunkara: అనిల్ సుంకర షో టైమ్..

ABN , Publish Date - Aug 13 , 2025 | 05:45 PM

సినిమా ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్నారా...? టాలెంట్ ఉన్నా ఎవరూ గుర్తించడంలేదని బాధపడుతున్నారా? ఎవరిని ఎలా అప్రోచ్ కావాలో తెలియక తికమకపడుతున్నారా.. అయితే మీకో గోల్డెన్ ఛాన్స్.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి ఓ అద్భుతమైన అవకాశం తలుపు తట్టబోతోంది.

Anil Sunkara

ఎంటర్టైన్మెంట్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసేందుకు.. ఆదాయానికి కొత్త మార్గాలు వేసుకునేందుకు మేకర్స్ ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్తో వస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర (Anil Sunkara ), AK ఎంటర్టైన్మెంట్స్, ATV ఒరిజినల్స్తో కలిసి 'షో టైమ్' - సినిమా తీద్దాం రండి అనే ఫిల్మ్మేకింగ్ రియాలిటీ షోను ప్రారంభిస్తున్నారు. దీని కాన్సెప్ట్ సర్వత్రా ఆసక్తికరంగా మారింది.


'షో టైమ్' (Show Time) సినిమా తీద్దాం రండి అనేది.. ఫిల్మ్ మేకింగ్ రియాలిటీ షో. సినీరంగంలోకి రావాలనుకునే నటీనటులు, రైటర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్లు, లిరిసిస్ట్లు, అసిస్టెంట్ డైరెక్టర్స్, ఎడిటర్స్, పబ్లిసిటీ డిజైనర్స్, .. ఇలా సినిమాకి సంబంధించి అన్ని విభాగాల్లోని వారికి తమ టాలెంట్ చూపించే అవకాశాన్ని కల్పించబోతోంది ఈ రియాలిటీ షో. స్క్రిప్ట్ నుంచి స్క్రీన్ వరకు సినిమా మేకింగ్ ను ఎంతో ఎక్సైటింగ్గా ఈ షో ద్వారా చూపించబోతున్నామని నిర్వాహకులు చెప్తున్నారు.

'నెవర్ బిఫోర్… ఎవర్ ఆఫ్టర్' ట్యాగ్లైన్తో వస్తున్న ఈ షో క్రియేటివిటీ, కాంపిటీషన్ తో ఉండి… ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో కలిసి స్టోరీ టెల్లింగ్, ప్రొడక్షన్, పోస్ట్-ప్రొడక్షన్ నేర్చుకునే అవకాశాన్ని కలిగిస్తుందని... ఆసక్తి ఉన్నవారు తమ ప్రొఫైల్స్ను 'contact@ak.movie'కు పంపాలని షో టైమ్ నిర్వాహకులు చెబుతున్నారు. సో అనిల్ సుంకర ఈ షో ద్వారా టాలీవుడ్కు కొత్త టాలెంట్ను పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నారన్నమాట. మరి ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం ద్వారా ఎంత మంది కొత్త టాలెంట్ తెలుగు చిత్రపరిశ్రమలో సత్తా చాటుతుందో చూద్దాం.

Read Also: The Raja Saab: దేవుడా..! ప్ర‌భాస్ రాజాసాబ్‌కు.. కొత్త త‌ల‌నొప్పి

Read Also: Thalaivan Thalaivii: మ‌రోసారి రూ.100 కోట్ల క్ల‌బ్‌లో.. విజయ్‌ సేతుపతి

Updated Date - Aug 13 , 2025 | 06:06 PM