Anil sunkara: నిర్మాత అనిల్‌ సుంకర ఇంట్లో విషాదం

ABN , First Publish Date - 2023-04-22T10:39:51+05:30 IST

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత అనిల్‌ సుంకర్‌ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన పెదనాన్న సుంకర బసవరావు శనివారం ఉదయం మరణించారు.

Anil sunkara: నిర్మాత అనిల్‌ సుంకర ఇంట్లో విషాదం

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత అనిల్‌ సుంకర్‌ (anil sunkara) ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన పెదనాన్న సుంకర బసవరావు 9Sunkara Basavarao is no more) శనివారం ఉదయం మరణించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ‘‘ఈ రోజు బ్యాడ్‌ న్యూస్‌తో తెల్లారింది. మా పెదనాన్న సుంకర బసవరావు గారు మరణించారు. నన్ను ఎంతగానో ప్రేమించే వ్యక్తి. అన్ని రకాల పోత్సహిస్తూ నా సక్సెస్‌లో భాగమైన పెదనాన్న లేరనే వార్త నన్ను కలచివేసింది. మా ఇన్సోవేషన్స్‌ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు. మిమ్మల్ని ఎప్పటికీ మిస్‌ అవుతాము. ఎంచుకున్న రంగంలో కష్టపడి సక్సెస్‌ సాధిస్తూ మీరు గర్వించేలా చేస్తాం. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.( RIP Sunkara Basavarao)

‘బిందాస్‌’ చిత్రంతో నిర్మాతగా కెరీర్‌ ప్రారంభించిన అనిల్‌ సుంకర 14 రీల్స్‌ సంస్థతో కలిసి దూకుడు, ఆగడు, లెజెండ్‌, రాజుగారి గది, కృష్ణగాడి వీర ప్రేమగాధ వంటి హిట్‌ చిత్రాలు నిర్మించారు. ప్రస్తుతం అనిల్‌ సుంకర నిర్మించిన ‘ఏజెంట్‌’ విడుదలకు సిద్ధమైంది. మెగాస్టార్‌ చిరంజీవితో ‘భోళా శంకర్‌’ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్‌లో విడుదల కానుంది.

Updated Date - 2023-04-22T10:39:51+05:30 IST