Su From So: తెలుగులోనూ వస్తోన్న.. రీసెంట్ కన్నడ బ్లాక్ బస్టర్
ABN, Publish Date - Aug 03 , 2025 | 06:53 PM
కన్నడలో గత వారం విడుదలై బాక్సాఫీసును షేక్ చేస్తోన్న చిత్రం సు ఫ్రమ్ సో.
కన్నడ (Kannada)లో గత వారం విడుదలై బాక్సాఫీసును షేక్ చేస్తోన్న చిత్రం సు ఫ్రమ్ సో (Su From So). ఓ విలేజ్ కామెడీ, హర్రర్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ కర్ణాటకలో సంచలనం సృష్టిస్తోంది. ఇ్పపుడీ సినిమాను తెలుగులోకి అనువాదం చేసి తీసుకు వస్తున్నారు. ప్రముఖ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మాణ సంస్థ ఆగస్టు 8న తెలుగులో గ్రాండ్ రిలీజ్‌కు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ పోస్టర్ రిలీజ్ చేసిన అధికారికంగా ప్రకటించింది.
మల్లూర్ అనే గ్రామంలోని ప్రజలంతా కలివిడిగా ఉంటూ సంతోషంగా ఉంటారు. అయితే ఓ రోజు అశోక్ అనే వ్యక్తిని సులోచన అనే దయ్యం ఆవహిస్తుంది. ఈ క్రమంలో ఆ గ్రామ ప్రజలు ఏం చేశారు, దయ్యం చుట్టూ వచ్చే పాత్రలు, అక్కడి ప్రజలు చేసే పనులు, కొన్ని ఎమోషనల్ సీన్లు, పూర్తిగా కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలతో ఎక్కడా బోర్ అనేదే రాకుండా సినిమాను తెరకెక్కించారు.
ప్రముఖ నటుడు రాజ్ బీ శెట్టి (Raj B. Shetty) ఈ చిత్రాన్ని నిర్మించగా షనీల్ గౌతమ్ (Shaneel Gautham), జేపీ తుమినాద్ (JP Thuminad), సంద్యా అరకేరె (Sandhya Arakere), ప్రకాష్ కె. తుమినాడు (Prakash K Thuminadu), దీపక్ రాయ్ పాంజె, మైమ్ రాందాస్ లాంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. జేపీ తుమినాద్ రచన చేసి దర్శకత్వం వహించాడు. సుమేధ్ కె సంగీతం అందించాడు.