Jatadhara: సుధీర్ బాబు, సోనాక్షి.. అద‌ర‌గొట్టారుగా

ABN , Publish Date - Aug 04 , 2025 | 01:24 PM

గ‌త సంవ‌త్స‌రం హ‌రోంహ‌ర, మా నాన్న సూప‌ర్ హీరో వంటి వైవిధ్య‌భ‌రిత చిత్రాల‌తో అల‌రించిన హీరో సుధీర్ బాబు న‌టిస్తోన్న నూత‌న చిత్రం ‘జటాధర’.

Sudheer Babu

గ‌త సంవ‌త్స‌రం హ‌రోంహ‌ర (Harom Hara), మా నాన్న సూప‌ర్ హీరో వంటి వైవిధ్య‌భ‌రిత చిత్రాల‌తో అల‌రించిన హీరో సుధీర్ బాబు (Sudheer Babu) న‌టిస్తోన్న నూత‌న చిత్రం ‘జటాధర’. పాన్ ఇండియాగా సినిమాటిక్ యూనివర్స్‌లో సూపర్ నేచురల్ ఫాంటసీ జాన‌ర్‌లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. బాలీవుడ్ బ్యూటీ ద‌బాంగ్ ఫేమ్ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) కీల‌క పాత్ర పోషిస్తూ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. అంతేగాక న‌మ్ర‌తా శిరోద్క‌ర్ సోద‌రి శిల్పా శిరోద్క‌ర్‌, ర‌వి ప్ర‌కాష్‌, ఇంద్ర కృష్ణ‌, న‌వీన్ నేని, శుభ‌లేఖ సుధాక‌ర్‌, రాజీవ్ క‌న‌కాల‌, ఝాన్షీ ఇత‌ర‌ పాత్ర‌లో న‌టిస్తున్నారు. వెంకట్ కళ్యాణ్ (Venkat Kalyan) ఈ మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తుండ‌గా శివన్ నారంగ్‌, ప్రేరణా అరోరా నిర్మిస్తున్నారు.

sudheerr.jpg

ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ మూవీ నుంచి తాజాగా సోమ‌వారం అభిమానుల‌ను, సినీ ల‌వ‌ర్స్‌ను స‌ర్‌ఫ్రైజ్ చేస్తూ ఓ చిన్న పోస్ట‌ర్‌ రిలీజ్ చేశారు. ఈ పొస్ట‌ర్‌లో పాతాళ భైరవిలో ఎన్టీఆర్ మాదిరి వేష‌ధార‌ణ‌లో సుధీర్ బాబు లుక్ అదిరిపోయింది. అద పోస్ట‌ర్‌లో మ‌రో వైపు ఉగ్ర‌ దేవ‌తా మూర్తిగా సోనాక్షి లుక్ సైతం ఫెరోసియ‌స్‌గా స్ట‌న్నింగ్ ఉంది. తాజాగా విడుద‌ల చేసిన ఈ పోస్ట‌ర్‌తో ఒక్క సారిగా అంచ‌నాలు అమాంతం పెరిగి పోయాయి. ఈ చిత్రంకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ జేయ‌నున్నారు. మ‌హేశ్ బాబు జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఆగ‌స్టు8న టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.


తెలుగులో.. దుల్క‌ర్ మ‌రో సినిమా! షూటింగ్ స్టార్ట్

Allu Aravind: ప‌వ‌న్ క‌ల్యాణ్.. మహావతార్ న‌ర‌సింహా చూడాలి

మంచు విష్ణుకి.. ఏమైంది! క‌న్న‌ప్ప త‌ర్వాత‌.. ఇలా అయ్యాడేంటి

Rajinikanth: నాకు.. సత్యరాజ్‌కు అభిప్రాయ భేదాలు నిజ‌మే!

Updated Date - Aug 04 , 2025 | 04:00 PM