Allu Aravind: పవన్ కల్యాణ్.. మహావతార్ నరసింహా చూడాలి
ABN , Publish Date - Aug 03 , 2025 | 01:56 PM
ఇటీవల థియేటర్లలోకి వచ్చి సంచలనాలు సృష్టిస్తోన్న చిత్రం మహావతార్ నరసింహా.
కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) కాస్త రూట్ మార్చి ప్రయోగాత్మకంగా నిర్మించిన చిత్రం మహావతార్ నరసింహా (Mahavatar Narasimha). అయితే ఇది పూర్తిగా యానిమేషన్ చిత్రం కావడం గమనార్హం. ఇప్పటివరకు క్లాస్, మాస్ అంటూ భారీ బడ్జెట్ సినిమాలతో సౌత్ ఇండస్ట్రీని షేక్ చేసిన హోంబలే ఫిలింస్ ఇప్పుడు మన సనాతన హిందూ పురాణ గాథను 3D రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. ఆడియన్స్‌ను కొత్త లోకంలో విహరింప జేస్తుంది. థియేటర్లలో సినిమా చూసిన వారంతా చాలామంది భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. హరతులు ఇస్తూ, పాటలు, కీర్తనలు ఆలపిస్తున్నారు.
అయితే.. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హరిహర వీరమల్లు ప్రేక్షకుల ఎదుటకు వచ్చిన రోజే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం నిధానంగా పుంజుకుని మౌత్ టాక్‌తో అంతకంతకు ఇప్పటికే రూ.70 కోట్ల వరకు వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. అల్లు అరవింద్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆదివారం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు అశ్వినీ కుమార్‌తో పాటు అల్లు అరవింద్, తనికెళ్ల భరణి, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ముఖ్య అతిథులుగా హజరయ్యారు. ఈ నేపథ్యంలో వారు సినిమాను తిలకించిన అనంతరం వారికి వచ్చిన అనుభూతులను వివరించారు.
ఈ క్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాక్యలు చేశారు. నాకు తెలిసి వారిలో, సన్నిహితుల్లోగానీ మా కుటుంబాల్లో గానీ సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు తెలిసినంత మరెవరికీ తెలియదు. సనాతన ధర్మం గురించి పవన్ చెబుతుంటే అందరం ముగ్ధులం అయిపోతాం. వారు ఈ మహావతార్ నరసింహా (Mahavatar Narasimha) సినిమా చూడాలని, ఈ సినిమా గురించి మాట్లాడాలని కోరుకుంటున్నా అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.