Manchu Vishnu: మంచు విష్ణుకి.. ఏమైంది! కన్నప్ప తర్వాత.. ఇలా అయ్యాడేంటి
ABN , Publish Date - Aug 03 , 2025 | 05:46 PM
ఇటీవల కన్నప్ప సినిమాతో అలరించిన మంచు విష్ణు ఇప్పుడు నటనకు కాస్త విశ్రాంతి ఇచ్చి ఫ్యామిలీ టైమ్ ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇటీవల కన్నప్ప (Kannappa) సినిమాతో అలరించిన మంచు విష్ణు (Vishnu Manchu) ఇప్పుడు నటనకు కాస్త విశ్రాంతి ఇచ్చి ఫ్యామిలీ టైమ్ ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేగాక విద్యా నికేతన్, మోహన్ బాబు యూనివర్సటీ (MohanBabu University) సంబంధిత పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. కన్నప్ప సినిమా విడుదలై విజయం అనంతరం మీడియాకు సైతం దూరంగా ఉంటూ వస్తోన్న ఆయన తాజాగా తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ రెండవ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో పాల్గొని సందడి చేశాడు.
ఈ సందర్భంగా డ్రమ్స్ కళాకారుడు శివమణి, మీడియా ఫీల్డ్‌కు చెందిన విజయ్ దర్దాలకు ప్రకటించిన డాక్టరేట్‌ను పెద్దల సమక్షంలో అందజేశారు. ఈ క్రమంలో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయగా వాటిని చూసిన వారంతా ఆయన లుక్‌పై భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. సినిమాలో, మూవీ ప్రమోషన్లలో ఎంతో చలాకీగా, యాక్టివ్‌గా సరదగా అనిపించిన విష్ణుకు ఇప్పుడు ఏమైంది, ఇలా అయిపోయాడేంటి, ఇంతలా చిక్కి పోయాడు ఏమైనా జ్వరంతో ఇబ్బంది పడుతున్నాడా అంటూ ఆయన అభిమానులు, చాలామంది నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
కన్నప్ప తర్వాత మీడియా ఎదుటకు అంతగా రాని విష్ణు (Vishnu Manchu) సడన్‌గా చిక్కి పోయిన లుక్‌లో కనిపించడంతో చూసిన వారంతా షాక్ వుతున్నారు. ఇప్పటికీ ఆ సినిమా హెయిర్ స్టైల్‌నే కంటిన్యూ చేస్తున్న విష్ణు తన తదుపరి ప్రాజెక్టుల గురించి ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలాఉంటే.. కన్నప్ప (Kannappa) సినిమా థియేటర్లకు వచ్చి నెల రోజులు దాటినా ఇంకా ఓటీటీ రిటీజ్ డేట్ మాత్రం బయటకు రాలేదు.