Dulquer Salmaan: తెలుగులో.. దుల్కర్ మరో సినిమా! షూటింగ్ స్టార్ట్
ABN , Publish Date - Aug 04 , 2025 | 03:22 PM
దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండియన్ సినీ ఇండస్ట్రీ పరిచయం అక్కర్లేని పేరు.
మలయాళ సూపర్‌స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండియన్ సినీ ఇండస్ట్రీ పరిచయం అక్కర్లేని పేరు. వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో తనదైన ముద్రవేశాడు. తెలుగులోనూ మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో అలరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో కాంత, ఆకాశంలో ఒక తార వంటి సిఇనమాలతో పాటు మలయాళంలోనూ రెండు చిత్రాలు చేస్తున్న ఆయన సడన్‌గా తెలుగులో మరో కొత్త సినిమాను లైన్‌లో పెట్టి ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు.
దుల్కర్ సల్మాన్ 41 (DQ41)వ చిత్రంగా ఈ సినిమా షూటింగ్‌ను సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించగా నాచురల్ స్టార్ నాని (Nani), బుచ్చిబాబు సానా (Buchi Babu Sana), ఓదెల శ్రీకాంత్ (Srikanth Odela) ముఖ్య అతిథిలుగా హజరవగా నాని క్లాప్ కొట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.
అయితే.. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో రవినేలకుడితి (avi Nelakuditi) దర్శకుడిగా ఎంట్రీగా ఇస్తుండగా ఎస్సెల్వీ సినిమాస్ (SLV Cinemas) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మిస్తున్నాడు. జీవీ ప్రకాశ్ కుమార్ (G.V.Prakash Kumar) సంగీతం అందిస్తున్నాడు. ఇదిలాఉంటే.. అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్నట్లు సమాచారం.