Bahubali Fun video: బాహుబలి షూట్‌లో ప్రభాస్ అల్లరి చూశారా...
ABN, Publish Date - Aug 03 , 2025 | 03:39 PM
'అమ్మా లేదు.. దేవ లేదు.. భల్లా లేదు’ అంటూ ప్రభాస్ సెట్‌లో చేసిన అల్లరి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
'అమ్మా లేదు.. దేవ లేదు.. భల్లా లేదు’ అంటూ ప్రభాస్ సెట్‌లో చేసిన అల్లరి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘బాహుబలి’ టీమ్ ఈ ప్రత్యేక వీడియోను ఎక్స్‌లో షేర్ చేసింది. షూటింగ్ టైమ్‌లో తెర వెనుక జరిగిన ఆసక్తికర సంభాషణ వీడియో అది. ఇందులో ప్రభాస్ ‘ఎంత పనిచేశావు దేవసేన’ అంటూ రానాతో ముచ్చటిస్తూ కనిపించారు. మధ్యలో అనుష్క వచ్చి మాట్లాడటంతో నవ్వులు పూశాయి.
ALSO READ: OG Records: ఓజీ రికార్ట్.. వరల్డ్ మ్యూజిక్ చార్ట్‌లో రెండో స్థానంలో..
ఈ చిత్రంలో అనుష్కకు సీమంతం చేసే సన్నివేశం చిత్రీకరణ సమయంలోని వీడియో ఇది. పస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రెండు భాగాలుగా విడుదలైన బాహుబలి’ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే! వరల్డ్ వైడ్ తెలుగు సినిమాకు క్రేజ్ తెచ్చిన సినిమా ఇది. ఇప్పుడు ఈ రెండు చిత్రాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఒకే సినిమాగా అక్టోబర్ 31న ప్రేక్షకులయుయ ముందుకు తీసుకున్నారు.
ALSO READ: Krishna Master: రేప్ కేసు.. ఢీ, బీబీ జోడి డాన్స్ మాస్టర్ కృష్ణ అరెస్ట్
Allu Aravind: పవన్ కల్యాణ్.. మహావతార్ నరసింహా చూడాలి
Ojas Gambheera: నాలుగు నిమిషాల పాట.. ఫ్యాన్ బోయ్ చాలానే చెప్పాడు..
Rajinikanth: రెండు రూపాయలు ఇచ్చి.. బాధ కలిగించేలా మాట్లాడాడు..