OG Records: ఓజీ రికార్ట్‌.. వరల్డ్‌ మ్యూజిక్‌ చార్ట్‌లో రెండో స్థానంలో..

ABN , Publish Date - Aug 03 , 2025 | 01:59 PM

ఎవడొస్తాడో రండి రా.. ఫయరు.. ఫీవరు.. ఆల్‌ టైమ్‌ రికార్డ్‌.. ఈజ్‌ పవన్‌ కల్యాణ్‌ ఫైర్‌ ఫుల్‌ వాల్యూమ్‌.. సన్‌డే మార్నింగ్‌ డ్రైవ్‌.. బండి ఎటో.. అభిమానులు ఓజీ సెలబ్రేషన్స్‌.


పగ రగిలిన ఫయరు.. (OG Movie)
ఎవడొస్తాడో రండి రా..
ఫయరు.. ఫీవరు..
ఆల్‌ టైమ్‌ రికార్డ్‌.. ఈజ్‌ పవన్‌ కల్యాణ్‌ ఫైర్‌
ఫుల్‌ వాల్యూమ్‌.. సన్‌డే మార్నింగ్‌ డ్రైవ్‌.. బండి ఎటో..

అభిమానులు ఓజీ సెలబ్రేషన్స్‌..

అంటూ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న మాటలివి. కారణం పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న 'ఓజీ' (OG Movie) చిత్రంలోని పాట కోసమే. శనివారం ఓజీ చిత్రం 'ఫైర్‌ స్ట్రామ్' (Fire Strome) పేరుతో ఫస్ట్‌ సింగిల్‌ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. అందులో లిరిక్స్‌, తమన్‌ బీట్‌, పవన్‌ లుక్స్‌ ఇలా ప్రతీది ఆసక్తికరంగా ఫ్యాన్స్‌ పిచ్చెక్కిపోయేలా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఫాట ఫీవరే నడుస్తోంది. మంచి బీట్‌లో తయారైన ఈ పాట ఫ్యాన్స్‌లో ఉత్సాహం రెట్టింపు చేసింది. అంతే కాదు సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. (No.2 in world Music chart)

ప్లాట్‌ఫామ్‌ ఏదైనా ట్రెండిండ్‌ ఉన్నది మాత్రం ‘ఫైర్‌ స్ట్రామ్ ’ పాటే. శనివారం మధ్యాహ్నాం విడుదలైన ఈ పాట ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్‌ వీడియోల్లో  రెండో స్థానంలో కూర్చుంది. ‘అన్‌ స్టాపబుల్‌ స్ట్రామ్ ’ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేసింది. రెండో స్థానంలో ఉండటం, దీనికి సంబంధించిన లిస్ట్‌ షేర్‌ చేసింది. అందరూ ఊహించిన దాని కంటే ఎక్కువగా పవన్‌ తుపాను సృష్టించడం ఖాయమని... మరిన్ని రికార్డుల బద్దలు కొట్టడం కోసం ఎదురుచూస్తున్నామని అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. సుజీత్‌ దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 25న విడుదల కానుంది. 

Updated Date - Aug 03 , 2025 | 02:03 PM