Ojas Gambheera: నాలుగు నిమిషాల పాట.. ఫ్యాన్ బోయ్ చాలానే చెప్పాడు..
ABN , Publish Date - Aug 03 , 2025 | 01:09 PM
సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతుందో ఈ లిరిక్స్ సూచిస్తున్నాయి. లిరిక్స్ నుంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇలా ప్రతీది ప్రత్యేకంగానే క్రియేట్ చేశారు.
పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఓజీ’. డి.వి.వి దానయ్య నిర్మాత. ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర, కథ గురించి కొన్ని హింట్స్ వదిలారు దర్శకుడు సుజీత్. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఫైర్ స్ట్రామ్' శనివారం విడుదలైంది.
'అలలిక కదలక భయపడేలే
క్షణక్షణమొక తల తెగిపడిలే
ప్రళయము ఎదురుగా నిలబడే
మేటి ధాటికి లోకం హడలే
రణమున యముడికి కనపడలే
దురుసుగా నివ్వు చరచకు తొడలే
పదునుగా తెగ విరిగిన మెడలే
రక్కసి దారుల రుధిరం పొరలే
ఫైర్.. ఇట్స్ కమింగ్.. ఇట్స్ బర్నింగ్
స్ట్రోమ్ ఈజ్ కమింగ్.. ఓజెస్ గంభీర..'
సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతుందో ఈ లిరిక్స్ సూచిస్తున్నాయి. లిరిక్స్ నుంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇలా ప్రతీది ప్రత్యేకంగానే క్రియేట్ చేశారు. విజువల్స్ అదిరేలా ఉన్నాయి. పవన్ లుక్స్ అయితే ఓ రేంజ్ అనే చెప్పాలి. ఆ లుక్స్ చూసి ఫ్యాన్ ఖుషీ అవుతున్నారు. అభిమాన హీరోని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా పవన్‌కు ఫ్యాన్ బాయ్ అయిన సుజీత్ చూపించారని ఆనందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఓజాస్ గంబీర (ఓజీ) గురించి ఈ పాటలో సుజీత్ హింట్స్ ఇచ్చారు. అయితే పాటలో సుజీత్ కొన్ని హింట్స్ ఇచ్చారు. అవి ఆలోచింపచేస్తున్నాయి. అంతే కాదు.. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఆయన క్యారెక్టర్ పేర్లు ఈ పాటలో కనిపించాయి. జానీ నుంచి మొదలు పెడితే బాలు, గబ్బర్‌సింగ్, ఇలా చాలా ఉన్నాయ్. ఆ పేర్లతో కూడిన ఫోటోను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా ట్వీట్ చేసింది.
‘బుషిడో’.. మ్యాగజైన్ చూశారా.. ఆ కథేంటి
ఆ పాటలో ఒక టేబుల్ మీద మ్యాగజైన్ ఉంది. దాని పై ఓ లుక్ వేస్తే కవర్ పేజీ మీద ‘బుషిడో : ద సమురాయ్ కోడ్ ఆఫ్ జపాన్ అని రాసి ఉంది. బుషిడో అంటే ‘ద వే ఆఫ్ వారియర్’ అని మీనింగ్. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే యోఽధుడు లేదా వీరుడు అనుసరించే మార్గం అని అర్థం. జపాన్‌లో సమురాయ్ వారియర్స్ ఫాలో అయ్యే ఫిలాసఫీని ‘బుషిడో’ అంటారు. అందులో మొత్తం ఏడు సూత్రాలు ఉంటాయి. నిజాయతీ, ధైర్యం, దయ, అతిథి మర్యాద, చిత్తశుద్థి, గౌరవం, విధేయత... ‘బుషిడో’ ప్రకారం వీరుడు ఈ ఏడు సూత్రాలను అనుసరించాలి. టేబుల్ మీద ఆ మ్యాగజైన్ చూపించడం ద్వారా ఈ చిత్రంలో ఆ సూత్రాలను అనుసరిస్తాడని సుజీత్ హింట్ ఇచ్చారా? అని టాక్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ సమురాయ్ క్యారెక్టర్ చేస్తున్నారని మరో టాక్. ‘బుషిడో’ బుక్ మీద జపనీస్ విద్యావేత్త ఇనాజో నీటోబే రాసినట్టు ఉంది.
గన్ లైసెన్స్ గడువు ముగుస్తుందా..
ఇప్పటి వరకు విడుదలైన ‘ఓజీ’ ప్రమోషనల్ కంటెంట్ చూస్తే ఈ సినిమాలో గన్స్ ఎక్కువ ఉంటాయని అర్థం తెలుస్తోంది ఆ గన్స్ అన్నిటినీ సుజీత్ ప్రత్యేకంగా డిజైన్ చేయించారని తెలిసింది. మామూలగా మనం చూసే గన్స్ కాకుండా కస్టమైజ్డ్ గన్స్ వాడారని తెలిసింది. ఇక ఇంకో విషయాన్ని కూడా సుజీత్ ప్రస్తావించారు. ఈ పాటలో ఒక షాట్‌లో గన్ లైసెన్స్ గురించి పేపర్ ఉంటుంది. జూలై 31తో ఈ లైసెన్స్ ఎక్స్‌పైర్ అవుతుందని దానిపై ఉంది. ఆ గన్ ఎవరిది. ఓజాస్ గంభీరాదా? అది తెలియాలంటే రిలీజ్ దాకా వేచి చూడాల్సిందే.