Vishal : 'మకుటం' సెట్స్ కు శింబు తండ్రి రాజేందర్
ABN, Publish Date - Sep 24 , 2025 | 02:54 PM
విశాల్ 'మకుటం' సినిమా సెట్స్ కు వెళ్ళిన టి. రాజేందర్. చెన్నయ్ టి.ఆర్. గార్డెన్ లో ఫైట్, సాంగ్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న మకుటం దర్శకుడు రవి అరసు.
వెర్సటైల్ హీరో విశాల్ (Vishal) 35వ చిత్రం 'మకుటం' (Makutam) షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చెన్నైలోని టి.ఆర్. గార్డెన్ లో కోట్లాది రూపాయల వ్యయంతో భారీ సెట్ వేసి, స్టంట్ డైరెక్టర్ దిలీప్ సుబ్బరాయన్ (Dilip Subbarayan) , డాన్స్ మాస్టర్ దినేష్ (Dinesh) తో కలిసి డాన్స్ మిక్డ్స్ ఫైట్ సీన్స్ ను హాలీవుడ్ స్టంట్ ఆర్టిస్టులతో తీస్తున్నారు. విశేషం ఏమంటే... ఇదే ప్రాంగణంలో ఇలాగే విశాల్ గత చిత్రం 'మార్క్ ఆంటోని'కి కూడా భారీ సెట్ ను వేశారు. ఇదిలా ఉంటే... ఈ సినిమా షూటింగ్ స్పాట్ కు వచ్చిన ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత టి. రాజేందర్ విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
'మకుటం' సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ మీద ఆర్.బి. చౌదరి (RB Chowdary) నిర్మిస్తున్నారు. ఆయనకు ఇది నిర్మాతగా 99వ సినిమా. రవి అరసు (Ravi Arasu) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సీ బ్యాక్ డ్రాప్ లో జరిగే మాఫియా కథ అని తెలుస్తోంది. అంజలి, దుషార విజయన్ ఫిమేల్ లీడ్స్ చేస్తున్న 'మకుటం' సినిమాలో విశాల్ యంగ్, మిడిల్ ఏజ్, ఓల్డేజ్ లుక్ లో కనిపించబోతున్నారు. ఈ గెటప్స్ తో ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి అప్లాజ్ వచ్చింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ (GV Prakash Kumar) సంగీతం అందిస్తున్నాడు. రిచర్డ్ ఎం. నాథన్ సినిమాటోగ్రఫర్ కాగా ఎన్. బి. శ్రీకాంత్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ మూవీకి దురైరాజ్ కళా దర్శకుడు.
Also Read: Power star: పవన్ కళ్యాణ్ 'ఓజీ'లో సుహాస్...
Also Read: Samantha: సమంత, రాజ్.. మరోసారి కెమెరాలకు చిక్కారు