OG: పవన్ కళ్యాణ్.. 'ఓజీ'లో సుహాస్

ABN , Publish Date - Sep 24 , 2025 | 01:28 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ 'ఓజీ'లో సుహాస్ సైతం ఓ అతిథి పాత్రలో మెరిసాడని తెలుస్తోంది. దర్శకుడు సుజీత్ తో ఉన్న చిరకాల అనుబంధం కారణంగానే సుహాస్ ఇందులో నటించాడని అంటున్నారు.

Suhaas in OG movie

దర్శకుడు సుజీత్ (Sujeeth), నటుడు సుహాస్ (Suhaas) ఇద్దరూ కూడా షార్ట్ ఫిల్మ్స్ తోనే కెరీర్ మొదలు పెట్టారు. ఆ అభిమానంతోనే కావచ్చు... ఇప్పుడు సోలో హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ తో తన 'ఓజీ' (OG) సినిమాలో సుజీత్ ఓ పాత్ర చేయించాడు. ఇది డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే సీన్ కాకపోయినా... ఇందులో కీలక పాత్ర పోషించిన అర్జున్ దాస్ (Arjun Das) కు అక్రమ ఆయుధాలను అందించే ఓ క్యారెక్టర్ లో సుహాస్ కనిపించాడని అంటున్నారు. పాత్ర నిడివితో సంబంధం లేకుండా ఇది పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan) సినిమా కావడం, సుజీత్ దర్శకుడు అవ్వడం వల్లే సుహాస్ ఈ పాత్ర చేశాడని తెలుస్తోంది.


'ఓజీ' సినిమా నిడివి బాగా ఎక్కువ కావడంతో ఎడిటర్ నవీన్ నూలికి గట్టిగానే పని పడిందట. మూడు గంటలకు పైగా నిడివి వచ్చిన ఈ మూవీని నవీన్ నూలి (Naveen Nooli) అతి కష్టం మీద 154 నిమిషాలకు రన్ టైమ్ ను లాక్ చేశాడట. ఆ రకంగా చూసినా 'ఓజీ' రెండున్నర గంటలకు మించిన సినిమా. 'ఓజీ'లో చాలా మంది ప్రముఖ నటీనటులు యాక్ట్ చేసినా... ఎడిటింగ్ కారణంగా కొన్ని పాత్రల నిడివి తగ్గిందని, మరికొన్ని పాత్రలు కట్ అయిపోయాయని తెలుస్తోంది. బుధవారం రాత్రి సినిమాను చూసిన తర్వాత కానీ ఏ ఆర్టిస్ట్ ఈ సినిమాలో ఉన్నాడు, ఏ ఆర్టిస్ట్ నటించిన పాత్ర ఎగిరిపోయిందనేది తెలియదు! అయితే... లక్కీగా సుహాస్ మాత్రం ఈ సినిమాలో ఉన్నాడని అంటున్నారు.

కెరీర్ ప్రారంభంలో చిన్న పాత్రలు చేసిన సుహాస్ 'కలర్ ఫోటో' (Color Photo) సినిమాతో హీరోగా తన సత్తాను చాటాడు. ఆ తర్వాత కూడా సుహాస్ నటించిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి. 'హిట్ -2' (Hit -2) లాంటి సినిమాలు సుహాస్ విలన్ గా నటించడానికీ వెనుకాడలేదు. అయితే... హీరోగా కొనసాగుతూనే కొన్ని ఆబ్లికేషన్స్ కారణంగా సుహాస్ ఇంకా ఇలా అతిథి పాత్రల్లో మెరుస్తున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. తెలుగులో మూడు నాలుగు సినిమాల్లో హీరోగా నటిస్తున్న సుహాస్ 'మందాడి' (Mandaadi) తో తమిళ చిత్రసీమలోకి అడుగు పెడుతున్నాడు.

Also Read: OG Mania: స‌ర్వం ఓజీ నామ‌స్మ‌ర‌ణే.. మిరాయ్ థియేట‌ర్లలో ఓజీ

Also Read: Samatha: స‌మంత‌, రాజ్.. మ‌రోసారి కెమెరాల‌కు చిక్కారు

Updated Date - Sep 24 , 2025 | 03:43 PM

OG - Pawan kalyan : పవన్‌ కనిపించేది ఎంత సేపంటే...

OG Trailer: గంభీర.. ఓజాస్‌ గంభీర.. నాకొడకల్లారా..

OG Censor Report: ఓజీ సెన్సార్ పూర్తి.. ఏపీ జీవోలో మార్పు

OG Concert: ఓజీ కన్సర్ట్.. స్టేడియం దద్దరిల్లడం ఖాయం

OG Firestorm: ఓజీ ఫైర్‌ స్ట్రామ్‌ గంభీర.. లిరికల్‌ వీడియో వచ్చేసింది