Samantha: స‌మంత‌, రాజ్.. మ‌రోసారి కెమెరాల‌కు చిక్కారు

ABN , Publish Date - Sep 24 , 2025 | 11:21 AM

స్టార్ హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు జిమ్ అవుటింగ్ ఫోటోలు వైరల్. ఇద్దరి రిలేషన్‌పై వస్తున్న రూమర్స్‌పై అభిమానుల ఆసక్తి పెరిగింది.

Samantha

స‌మంత (samantha), దర్శకుడు రాజ్ నిడిమోరు (raj-nidimoru)తో మ‌ధ్య‌ సన్నిహిత్యం గ‌త కొంతకాలంగా టాలీవుడ్, బాలీవుడ్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే. చాకాలంగా వీరిరువురిపై అనేక వార్త‌లు వ‌స్తున్నా ఇప్ప‌టివ‌ర‌కు ఖండించింది లేదు. దీంతో ఈ వార్త‌ల‌కు ఇప్ప‌ట్లో ఫుల్‌స్టాప్ ప‌డే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఇరువురు మ‌రోమారు మీడియా కంట్లో ప‌డి వార్త‌ల్లో నిలిచారు.

తాజాగా ముంబై బాంద్రాలోని ఓ ప్రైవేట్ జిమ్‌ వద్ద ఇద్దరూ కలిసి కనిపించారు. లైట్ పింక్ జిమ్ డ్రెస్సుల్లో బయటకు వచ్చిన స‌మంత రోడ్డుపై ఆగి ఉన్న కారు ఎక్కి వెళ్లి పోయింది. ఆ కారులోనే రాజ్ కూడా ఉండ‌డం మరింత చర్చనీయాంశమైంది. వీదీంతో ఇప్పుడు ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే వీరిద్దరూ కలిసి వేకేషన్స్, రెస్టారెంట్ డిన్నర్స్, ఆలయ దర్శనాలు, పికెల్ బాల్ ఆటలు అంటూ అనేక సంద‌ర్భాల్లో జంట‌గా కినిపిస్తూ వ‌స్తున్నారు. కొన్ని సార్లు సామ్ రాజ్ భుజంపై తల వాల్చిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు వీరి రిలేషన్‌పై క్లారిటీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఇద్దరూ మౌనం పాటిస్తున్నా, త్వరలోనే ఎలాంటి అధికారిక ప్రకటన వస్తుందో చూడాలి.

ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన రాజ్ నిడిమోరుకు ఇప్పటికే శ్యామాలి అనే మహిళతో వివాహం జరిగింది. ఒక కుమార్తె కూడా ఉంది. అయితే గత కొద్ది రోజులుగా రాజ్–శ్యామాలి విడాకుల దిశగా వెళ్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారికంగా ఎవరూ స్పందించలేదు. శ్యామాలి మాత్రం తరచూ పోస్టులు పెడుతూ చర్చల్లో నిలుస్తున్నారు.

ఇక‌.. స‌మంత మ‌రో వైపు వృత్తిపరంగా ఓ వైపు బాలీవుడ్, వెబ్‌సిరీస్‌లపై దృష్టి పెట్టగా, మరోవైపు హెల్త్, ఫిట్నెస్, స్పిరిచ్యువాలిటీపై ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసే ఆధ్యాత్మిక కోట్స్ అభిమానుల్లో పాజిటివ్ వైబ్స్ కలిగిస్తున్నాయి.

Updated Date - Sep 24 , 2025 | 04:07 PM