సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vijayakanth: 500 థియేటర్లలో ‘కెప్టెన్‌ ప్రభాకరన్‌’ రీ రిలీజ్‌

ABN, Publish Date - Jul 25 , 2025 | 09:25 AM

విజయకాంత్ జయంతిని పురస్కరించుకుని ‘కెప్టెన్‌ ప్రభాకరన్‌’ చిత్రాన్ని వచ్చే నెల 22న 500కు పైగా థియేటర్లలో రిలీజ్‌ చేయనున్నారు.

Vijayakanth

దివంగత సినీ నటుడు విజయకాంత్ (Vijayakanth) జయంతిని పురస్కరించుకుని ఆయన నటించిన చిత్రాల్లో బ్లాక్‌బస్టర్‌ హి ట్‌గా నిలిచిన ‘కెప్టెన్‌ ప్రభాకరన్‌’ (Captain Prabhakaran) చిత్రాన్ని వచ్చే నెల 22న 500కు పైగా థియేటర్లలో రిలీజ్‌ చేయనున్నారు. ఈ విషయాన్నిఇటీవ‌ల ఓ మీడియా సమావేశంలో ఆ చిత్ర దర్శకుడు ఆర్‌కే సెల్వమణి (R. K. Selvamani), కోలీవుడ్‌ దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్‌వీ ఉదయకుమార్‌, డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత, డీఎండీకే కోశాధికారి సుధీశ్‌ సంయుక్తంగా వెల్లడించారు.

ఇదే విషయంపై వారు మాట్లాడుతూ, ‘విజయకాంత్‌ నటించి వందో చిత్రమైన ‘కెప్టెన్‌ ప్రభాకరన్‌’ బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు సాధించడంతో పాటు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీగా నిలిచింది. 1991, ఏప్రిల్‌ 14న తమిళ నూతన సంవత్సరాది సందర్భంగా విడుదల చేయగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆలరించింది. ఈ చిత్రం తర్వాతే విజయకాంత్‌ పేరుకు ముందు ‘కెప్టెన్‌’ అనే పేరు చేరింది.

అలాగే, ఈ సినిమా విడుదలై 34 యేళ్ళు పూర్తయిన నేపథ్యంలో ఆయన బర్త్‌డే (ఆగస్టు 25) సందర్భంగా, అత్యాధునిక 4కే టెక్నాలజీతో ఆగస్టు 22న విడుదల చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 500కుపైగా థియేటర్లలో స్పారో సినిమాస్‌ తరపున కార్తీక్‌ వెంకటేశన్‌ విడుదల చేయనున్నారు’ అని వివరించారు.


Also Read.. ఇవి కూడా చ‌ద‌వండి.. బావుంటాయ్‌

ఓటీటీలో.. డ‌కోటా జాన్స‌న్ రొమాంటిక్ డ్రామా! కుర్రాళ్లకు పండ‌గే

వార్‌2 ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎన్టీఆర్ దుమ్ము దులిపేశాడు

రెండు రోజులుగా.. నిద్ర లేదు

ప‌వ‌న్ కళ్యాణ్‌తో ఫొటో.. ఎగిరి గంతేసిన అభిమాని! వీడియో వైర‌ల్

OTTకి వ‌చ్చేసిన.. అదిరిపోయే లేటెస్ట్ క్రైమ్ థ్రిల్ల‌ర్

ఆ ఓటీటీకి వ‌చ్చిన‌.. న‌వీన్ చంద్ర ఫ్యామిలీ థ్రిల్ల‌ర్

Updated Date - Jul 25 , 2025 | 12:33 PM