Suriya: హీరోలను వెట్రీ మబ్బుల్లో పెడతాడా...

ABN , Publish Date - Sep 02 , 2025 | 01:17 PM

సూర్య, వెట్రిమారన్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన 'వాడి వాసల్' సినిమా ఆగిపోయింది. దానికి కారణం వెట్రిమారన్ అని తెలుస్తోంది.

Surya - Vetrimaaran

ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ కు మంచి పేరుంది. జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న దర్శకుడిగానే కాకుండా అట్టడుగు వర్గాల వెతలను వెండితెరపై అద్బుతంగా ఆవిష్కరిస్తాడని అందరూ చెబుతుంటారు. తొలిసారి సూర్య (Suriya), వెట్రిమారన్ (Vetrimaaran) కాంబోలో 'వాడి వాసల్' (Vaadi vaasal) అనే సినిమా రాబోతోందనే ప్రచారం ఆ మధ్య జరిగింది. ఇద్దరి అభిమానులు ఈ కలయికలో మంచి సినిమా వస్తుందని ఆశపడ్డారు. కానీ అర్థంతరంగా సూర్య ఈ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చేశాడు. దాంతో ఇప్పుడు సింబుతో వెట్రిమారన్ మూవీ తీస్తున్నాడు.


సూర్య, వెట్రిమారన్ సినిమా ఆగిపోవడానికి రకరకాల కారణాలు బయట ప్రచారంలో ఉన్నాయి. అయితే... ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో వెట్రిమారన్ ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి తానే కారణమని అంగీకరించినట్టు తెలిసింది. సినిమా కథ సూర్యకు బాగా నచ్చిందని, దాన్ని డెవలప్ చేయమని చెప్పారని, పూర్తి కథను విన్నతర్వాతే తాను ఈ ప్రాజెక్ట్ లోకి అడుగుపెడతానని సూర్య చెప్పాడని వెంట్రీ అన్నాడు. అయితే సూర్య కోరినట్టు పూర్తి కథను ఇవ్వలేకపోయానని, అందువల్లే సూర్య సున్నితంగా ఈ చిత్రాన్ని తిరస్కరించారని వెట్రీ చెప్పాడని అంటున్నారు.


నిజానికి కొన్నేళ్ళుగా వెట్రిమారన్ విషయంలో తమిళ చిత్రసీమలో ఈ ఆరోపణ ఉంది. అతనికి ఉన్న సక్సెస్ రేట్ కారణంగా ఎప్పుడూ ఏ హీరో కూడా వెట్రిమారన్ ను పూర్తి కథ అడిగేవారు కాదని అంటున్నారు. అలానే వెట్రీ కూడా పూర్తి కథ చెప్పేవాడు కాదట. వెట్రీ చెప్పిన లైన్ నచ్చే చాలామంది హీరోలు అతనితో వర్క్ చేశారని చెప్పుకుంటారు. మనసులో ఓ పాయింట్ అనుకుని, వెట్రీ ఎప్పటికప్పుడు దానిని డెవలప్ చేసుకుంటూ పోతాడని, అందువల్ల సినిమా కాల్ షీట్స్ కూడా బాగా పెరిగిపోయాని, అలానే బడ్జెట్ సైతం పరిధులు దాటిపోతుందనే అనుకుంటూ ఉంటారు. అంతేకాకుండా... వెట్రీ తన భావాలకు అనుగుణంగా సినిమాలు తీస్తూ వెళతాడు. ఒకసారి సినిమాకు కమిట్ అయిన తర్వాత హీరోలు... కొన్ని తమకు ఇష్టంలేని సన్నివేశాల్లో సైతం నటించాల్సి వస్తుంది. అభిప్రాయాల భేదాలతో సినిమా మధ్యలోంచి వెళ్ళిపోవడం భావ్యం కాదని భావించి, చాలామంది హీరోలు రాజీ పడి, వెట్రి చెప్పినట్టుగా ఆ యా సన్నివేశాలలో నటిస్తుంటారట. ఏదేమైనా... ఇవాళ సమాజంలోని సున్నితమైన అంశాలను వెండితెరపై ఆవిష్కరిస్తున్న దర్శకులలో వెట్రిమారన్ ఒకరు. అందువల్ల ఆయన చేసే సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేయడం సబబు అని కమర్షియల్ హీరోలు భావిస్తున్నారట. అందువల్లే సూర్య.. ముందే ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని కూడా కొందరు చెప్పుకుంటున్నారు.

Also Read: Pawan kalyan: ‘చరిత్రలో ఒకే ఒక్కడు.. కోట్ల మంది గుండెల్లో ఆశాజ్యోతి' అభిమాన వర్షం 

Also Read: The Bengal Files: మమతా బెనర్జీకి వివేక్ వేడుకోలు...

Updated Date - Sep 02 , 2025 | 01:29 PM

Suriya - Agaram: 15 ఏళ్ల ప్రయాణం.. 51 మంది డాక్టర్లు.. 1800 మంది ఇంజనీర్లు..

Suriya - Jyothika: మీ భర్తను నాకు ఇస్తారా?

Suriya - Chandoo: సూర్య కోసం రెండు కథలు.. ఏది ఫైనల్‌ అవుతుందో..

Vetrimaaran: ట్రైలర్‌ చూశాకే ప్రేక్షకుడు నిర్ణయించుకుంటున్నాడు..

Vetrimaaran: విజయ్‌ హీరోగా సినిమా తీస్తా.. కానీ?

Vetrimaaran: ‘విడుదల’కు పాజిటివ్ టాక్.. ఛాన్స్ ఇచ్చే టాలీవుడ్ హీరో ఎవరు?