Vetrimaaran: విజయ్‌ హీరోగా సినిమా తీస్తా.. కానీ?

ABN , First Publish Date - 2023-06-27T22:28:07+05:30 IST

అగ్ర హీరో విజయ్‌తో సినిమాను తెరకెక్కిస్తానని.. అయితే, అది ఇప్పట్లో సాధ్యం కాదని ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్‌ అన్నారు. ప్రస్తుతం తాను అంగీకరించిన రెండు మూడు ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాత విజయ్‌ను కలిసి కథను వినిపిస్తానని, అది ఆయనకు నచ్చితే సెట్స్‌ పైకి తీసుకెళతానని చెప్పారు.

Vetrimaaran: విజయ్‌ హీరోగా సినిమా తీస్తా.. కానీ?
Vetrimaaran and Hero Vijay

అగ్ర హీరో విజయ్‌తో సినిమాను తెరకెక్కిస్తానని.. అయితే, అది ఇప్పట్లో సాధ్యం కాదని ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్‌ (Vetrimaaran) అన్నారు. ప్రస్తుతం తాను అంగీకరించిన రెండు మూడు ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాత విజయ్‌ను కలిసి కథను వినిపిస్తానని, అది ఆయనకు నచ్చితే సెట్స్‌ పైకి తీసుకెళతానని చెప్పారు. తమిళ సినిమా పాత్రికేయుల సంఘం (టీఎంజేఏ) సభ్యులకు ఆరోగ్య బీమా (Health Insurance) కార్డుల పంపిణీ సోమవారం చెన్నై, వడపళనిలోని ప్రసాద్‌ స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు వెట్రిమారన్‌ ముఖ్య అతిథిగా హాజరై సంఘ సభ్యులకు కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆరోగ్య బీమా ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యం. కానీ, దీనిపట్ల అనేక మంది నిర్లక్ష్యం చేస్తారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆరోగ్య బీమా చేయించుకోవాలి. రోజువారీ చర్యల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ప్రతి రోజూ ఉదయాన్నే చిన్నపాటి వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. ఆరోగ్యంపై మహిళలు పెద్దగా శ్రద్ధ చూపరు. ముఖ్యంగా ఇంట్లో ఆహారం మిగిలిపోతే దాన్ని వృథా చేయడం మనసురాక వారే తింటూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటారు. మనం తీసుకునే ఆహారంలో అధికంగా పీచు, ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. వీటిని క్రమంగా తప్పకుండా మనం తీసుకుంటే సగం అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. బిర్యానీ వంటి మసాలాతో కూడిన ఆహారం తీసుకునేముందు పండ్లు, కూరగాయలు తీసుకుని తక్కువ మోతాదులో ఆరగించాలని అన్నారు. (Director Vetrimaaran)

ఆ తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. హీరో ధనుష్‌ (Dhanush)తో ‘వడ చెన్నై’ రెండో భాగం ఉంటుంది. ‘అసురన్‌’ చిత్రం తెరకెక్కే సమయంలోనే సూరి హీరోగా ఒక చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నాం. ఆ తర్వాత రెండు మూడు ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత ‘వడ చెన్నై-2’ను తెరకెక్కిస్తానని వెట్రిమారన్‌ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Tamannaah: ‘లస్ట్ స్టోరీస్ 2’ చూడడానికి భయపడవద్దు.. ఎంజాయ్ చేయండి


**************************************

*Priyanka Tumpala: 16 ఏళ్ల కెరీర్.. 150కి పైగా చిత్రాలు.. షేకాడిస్తోన్న డబ్బింగ్ ఆర్టిస్ట్

********************

*OTT: ఓటీటీలో అమ్మకానికి మాయాబజార్.. ఎప్పుడంటే?


**************************************

*VJ Sunny: బ్రేకింగ్.. రాజకీయాల్లోకి విజె సన్నీ.. కొత్త పార్టీ అనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే?


**************************************

*Venu Udugula: ఎవరొచ్చిరి ఏమిచ్చిరి.. ఏ మాటలు ఎక్కడెక్కడ గుచ్చిరి?


**************************************

*Rashmika Mandanna: నెటిజన్ షేర్ చేసిన వీడియో చూసి రష్మిక ఫుల్ ఖుష్.. అందులో ఏముందంటే?


**************************************

*NTR: ఎన్టీఆర్ ‘శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం’ మూవీ గురించి ఈ విషయాలు తెలుసా?

**************************************

Updated Date - 2023-06-27T22:28:07+05:30 IST