Vetrimaaran: ‘విడుదల’కు పాజిటివ్ టాక్.. ఛాన్స్ ఇచ్చే టాలీవుడ్ హీరో ఎవరు?

ABN , First Publish Date - 2023-04-15T19:14:29+05:30 IST

టాలీవుడ్‌లో ఇది వెట్రికి తొలి ప్రయత్నం. మొదటి ప్రయత్నంతోనే మంచి హిట్ అందుకున్న ఈ దర్శకుడిపై ఇప్పుడు టాలీవుడ్ హీరోల కన్ను పడినట్లుగా..

Vetrimaaran: ‘విడుదల’కు పాజిటివ్ టాక్.. ఛాన్స్ ఇచ్చే టాలీవుడ్ హీరో ఎవరు?
Vidudhala Movie Team

వెట్రిమారన్ (Vetrimaaran) తమిళ చిత్ర పరిశ్రమ (Kollywood)లో ప్రముఖ దర్శకుడు మరియు తెలుగులోనూ అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆడుకాలం, అసురన్, వడ చెన్నై వంటి కల్ట్ చిత్రాలు ఆయన దర్శకత్వంలో వచ్చాయి. తాజాగా ఈ దర్శకుడి చిత్రం ‘విడుతలై’ సినిమా తెలుగులో ‘విడుదల పార్ట్ 1’ (Vidudhala Part 1)గా విడుదలై అన్ని చోట్ల నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. శనివారం థియేటర్లలోకి వచ్చిన ‘విడుదల పార్ట్ 1’ చిత్రం ప్రేక్షకుల మరియు విమర్శకుల నుండి మంచి సమీక్షలను పొందింది. వెట్రిమారన్ ఈ రా స్టోరీతో విజయవంతంగా సక్సెస్ అందుకున్నాడు. యాక్షన్ సీన్స్ రియలిస్టిక్‌గా ఉండటంతో పాటు.. రైలు ప్రమాద సన్నివేశం సినిమాకే హైలెట్ అనేలా టాక్ బయటికి వచ్చింది. టాలీవుడ్‌లో ఇది వెట్రికి తొలి ప్రయత్నం. మొదటి ప్రయత్నంతోనే మంచి హిట్ అందుకున్న ఈ దర్శకుడిపై ఇప్పుడు టాలీవుడ్ హీరోల కన్ను పడినట్లుగా తెలుస్తుంది.

Also Read- Vidudala Part 1 film review: ‘విడుదల’లో విషయం వుంది, చూడాల్సిన సినిమా

రీసెంట్‌గా ‘విడుదల పార్ట్ 1’ చిత్ర ప్రమోషన్స్‌లో వెట్రిమారన్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ (Allu Arjun), మహేష్ బాబు (Mahesh Babu), జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR)ల పేర్లు హైలెట్ చేశారు. అల్లు అర్జున్, మహేష్ బాబులతో సినిమాలు అనుకున్నా.. సాధ్యపడలేదని తెలిపాడు. ఇప్పుడు హిట్టు కొట్టి.. ఇక్కడ కూడా నిరూపించుకున్నాడు కాబట్టి.. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిని, లేదంటే ఇద్దరినీ కలిపి డైరెక్ట్ చేసే అవకాశం లేకపోలేదు. అలాంటి కథ తన దగ్గర ఉన్నట్లుగా కూడా రీసెంట్‌గా తెలిపాడు. అలాగే ఈ చిత్రాన్ని గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ (Geetha Film Distribution) ద్వారా అల్లు అరవింద్ విడుదల చేశారు. తనకి హిట్ ఇచ్చిన దర్శకులను అల్లు అరవింద్ (Allu Aravind) అంత సామాన్యంగా వదిలిపెట్టరు. కచ్చితంగా వెట్రిమారన్‌తో అరవింద్.. డైరెక్ట్ తెలుగు చిత్రం ప్లాన్ చేస్తాడనేలా కూడా ఇప్పుడు టాక్ మొదలైంది. చూద్దాం మరి.. వెట్రిమారన్ డైరెక్ట్ చేయబోయే తొలి తెలుగు హీరో ఎవరో?

Vijay-Sethupathi.jpg

‘విడుదల పార్ట్ 1’ విషయానికి వస్తే.. ప్రతి పాత్ర వెనుక ఆయన చేసిన కృషి తెరపై కనిపిస్తుంది. అతని అసలైన మరియు గ్రామీణ చిత్ర నిర్మాణ శైలి అందరిని సర్‌ప్రైజ్ చేస్తోంది. (Positive Talk to Vidudhala Movie) ఈ సినిమాలో సమాజాన్ని ప్రశ్నించే సామాజిక సందేశం మరియు సాధారణ ప్రజలు వ్యవస్థ యొక్క మరో వైపు కూడా చూసేలా చేస్తుంది. సూరి, విజయ్ సేతుపతి మరియు భవానీ శ్రీల నటన కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌లపై ఎల్రెడ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. లెజెండరీ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Tammreddy Bharadwaja: మీ ఫ్యామిలీస్‌‌ని తిట్టినప్పుడు.. ఏమైంది మీ మగతనం? ఇండస్ట్రీ హీరోలకి సూటి ప్రశ్న?

*Actress Prema: రెండో పెళ్లి విషయమై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ప్రేమ..!

*Radhika Apte: నన్ను ఆ సర్జరీ చేయించుకోమన్నారు.. ఇప్పుడలా అంటేనా?

*Allu Arha: ‘రుద్రమదేవి’కి అల్లు అర్జున్.. ‘శాకుంతలం’కి అల్లు అర్హ

*Namitha: అది మన సంస్కృతి కాదు. మనకంటూ ఒక సంస్కృతి ఉంది

*KGF Actress: ‘కెజియఫ్‌’లో వణికించిన నటి.. ఇప్పుడు హాస్పిటల్‌లో ఉంది

Updated Date - 2023-04-15T19:14:30+05:30 IST