Pawan kalyan: ‘చరిత్రలో ఒకే ఒక్కడు.. కోట్ల మంది గుండెల్లో ఆశాజ్యోతి' అభిమాన వర్షం
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:48 PM
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు.. ఒక్కోసారి తగ్గడం కూడా నెగ్గడమే అవుతుంది.. (Pawan Kalyan)
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు..
ఒక్కోసారి తగ్గడం కూడా నెగ్గడమే అవుతుంది.. (Pawan Kalyan)
ఈ డైలాగ్‌లను సినిమాలకే పరిమితం చేయకుండా రాజకీయాల్లోనూ అన్వయించి విన్నర్ అయ్యారు పవన్‌కల్యాణ్. వందకు వందశాతం నిలబడిన ప్రతి సీట్‌ను గెలుచుకుని ఎవరూ సాధించని ఘనతను తన సొంతం చేసుకున్నారు. పోటీ చేసిన రెండు సీట్లతో గెలవలేకపోయాడని హేళన చేసిన వారికి రిజల్ట్‌తో సమాధానమిచ్చి ఏపీ డిప్యూటీ సీఎంగా (AP Deputy Cm) పదవిని పొందారు. మంగళవారం ఆయన పుట్టినరోజు. సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు, ఆయన్ను ఎంతగానో అభిమానించే అభిమానుల శుభాకాంక్షలతో సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. మరోపక్క ఆయన నటిస్తున్న చిత్రాల అప్‌డేట్స్ ప్రేక్షకుల్ని పిచ్చెక్కిస్తున్నాయి. ‘దీర్ఘాయుష్మాన్ భవ..’ అంటూ చిరంజీవి ఓ అరుదైన ఫొటోతో పవన్‌ను విష్ చేశారు. (Happy Birthday Pawan kalyan)
‘చలనచిత్ర రంగంలో అగ్ర నటుడిగా ప్రజా జీవితంలో జనసేనానిగా, ఆంధ్రపదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా ేసవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాయుష్మాన్‌భవ అని చిరంజీవి ట్వీట్ చేశారు. ఆయనతోపాటు అగ్ర కథానాయకులు దర్శకనిర్మాతలు పవన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
‘హ్యాపీ బర్త్‌డే పవన్‌కల్యాణ్ గారు.. మీ నిస్వార్థ స్వభావాన్ని ప్రత్యక్షంగా చూస్తూ పెరిగినందుకు నేను నిజంగా అదృష్టవంతుడిని. మీ ప్రయాణం నాకే కాదు.. లక్షల మందికి స్ఫూర్తినిస్తూనే ఉంది. మీరు మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటున్నా’
- రామ్ చరణ్
‘‘మన పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు’
- అల్లు అర్జున్
‘‘హ్యాపీ బర్త్‌డే మై డియర్ ఫ్రెండ్ పవన్ కల్యాణ్. మీరు చేసే ప్రతి పని మీకు ఆనందాన్ని, విజయాన్ని ఇవ్వాలి’
- వెంకటేశ్
‘నాకు పట్టుదల నేర్పించి.. నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన నా గురువుకు జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్‌డే కల్యాణ్ మామ’
- సాయి దుర్గ తేజ్
‘చరిత్రలో ఒకే ఒక్కడు. కోట్ల మంది గుండెల్లో ఆశాజ్యోతిగా మారిన మహోన్నత వ్యక్తి పవన్ కల్యాణ్. మీ పుట్టుకే ఒక అద్భుతం. హ్యాపీ బర్త్‌డే మై బాస్. మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా, మహోన్నతంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ’
- బండ్ల గణేశ్
‘‘మీరు లక్షల మందికి స్ఫూర్తి. నిజమైన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు
- దర్శకుడు జ్యోతి కృష్ణ.
‘తాను ఒక యోగి, ఒక త్యాగి, నూటికి ఒక్కడు కాదు.. కోటికి ఒక్కడు. అతను అక్కడిఅమ్మాయికి ఇక్కడి అబ్బాయి కాదు, ఎక్కడున్నా నేను మీకోసం అంటూ ముందడుగు వేసే వకీల్ సాబ్. తానే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కల్యాణ్. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు’
- పరుచూరి గోపాలకృష్ణ