The Bengal Files: మమతా బెనర్జీకి వివేక్ వేడుకోలు...

ABN , Publish Date - Sep 02 , 2025 | 12:39 PM

ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి... పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఓపెన్ అపీల్ చేశారు. సెప్టెంబర్ 5న విడుదల కాబోతున్న తన 'ది బెంగాల్ ఫైల్స్' సినిమాను అడ్డుకోవద్దని కోరారు.

Director Vivek Agnihotri

ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి... పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బహిరంగ విన్నపం చేశారు. తాను రూపొందించిన 'ది బెంగాల్ ఫైల్స్' సినిమాను అడ్డుకోవద్దని, పశ్చిమ బెంగాల్ లో దీని విడుదలకు సహకరించమని ఆమెను కోరారు. ఈ దేశంలో మైనారిటీలు, మహిళలు, దళితులకు జరిగిన అన్యాయాలపై చిత్రాలు వస్తున్నప్పుడు హిందువులకు జరుగుతున్న అన్యాయాలపై సినిమా వస్తే తప్పేమిటని, అలాంటి సినిమాలను అడ్డుకోవడం సబబు కాదని వివేక్ అగ్నిహోత్రి అన్నారు.


'ది తాష్కెంట్ ఫైల్స్', 'ది కశ్మీర్ ఫైల్స్' తర్వాత ఆ వరసులో మూడో చిత్రంగా వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) 'ది బెంగాల్ ఫైల్స్' (The Bengal Files) సినిమాను రూపొందించారు. హిందీ, తెలుగు, బెంగాలీ భాషల్లో ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కాబోతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లోనూ, అమెరికాలోనూ దీనిని ప్రదర్శించారు. వాటికి చక్కని స్పందన లభించింది. అయితే... ఈ సినిమాను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విడుదల కాకుండా అడ్డుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే... ఆ మధ్య మూవీ ట్రైలర్ ను బెంగాల్ లో విడుదల చేయడానికి మేకర్స్ ప్రయత్నించినప్పుడు అక్కడి పోలీసులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. థియేటర్లలో ట్రైలర్ ప్రదర్శనకూ అనుమతి ఇవ్వలేదు. అంతేకాకుండా వివేక్ అగ్నిహోత్రిపై పలు నగరాలు, పట్టణాలలో టి.ఎం.సి. నాయకులు కేసులు పెట్టారు. దాంతో ఆయన అమెరికా వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడి నుండే 'ది బెంగాల్ ఫైల్స్' మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు.


ఇటీవల ప్రముఖ బెంగాలీ నటుడు విక్టర్ బెనర్జీ సైతం 'ది బెంగాల్ ఫైల్స్'ను అడ్డుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. మిధున్ చక్రవర్తి (Mithun Chakraborty), పల్లవి జోషి (Pallavi Joshi), శాశ్వత్ ఛటర్జీ, అనుపమ్ ఖేర్ (Anupam Kher), సిమ్రత్ కౌర్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా గురించి వివేక్ అగ్నిహోత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) ని ఉద్దేశించి మాట్లాడుతూ, 'భారతదేశ స్వాతంత్య్ర ప్రకటన తర్వాత బెంగాల్ లో జరిగిన హిందువుల ఊచకోత సంఘటనలు ఈ దేశంలోని ప్రతి ఒక్కరికీ తెలియాల్సి ఉంద'ని ఆయన అన్నారు. ఈ సినిమా సమాజంలో చీలికలు తీసుకొచ్చేది కాదని వాస్తవ సంఘటనలకు దర్పణమ'ని చెప్పారు. అద్దాన్ని పగల కొట్టినంత మాత్రాన ముఖం మారిపోదని, వాస్తవాలను అంగీకరిస్తూ, ఉపశమనం పొంది సమాజం ముందుకు పోవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి దేశ పౌరుడు తమకు జరిగిన అన్యాయాల గురించి తెలుసుకున్నప్పుడు స్వాంతన పొందుతాడని, వాస్తవాలను కప్పిపుచ్చితే ఎప్పుడోకప్పుడు అది అగ్నిపర్వతంలా బద్దలయ్యే ఆస్కారం ఉందని ఆయన హెచ్చరించారు. భావ ప్రకటన స్వేచ్ఛకు భగ్నం కలిగించడం సబబు కాదని, సెన్సార్ సర్టిఫికెట్ పొందిన తమ చిత్రాన్ని ప్రదర్శించకుండా అడ్డుకోవడం అన్యాయమని, ఈ సినిమా విడుదలకు సహకరించాల్సిందిగా చేతులు జోడించి వేడుకుంటున్నానని ఈ వీడియోలో వివేక్ అగ్నిహోత్రి ప్రాధేయపడ్డారు. ట్రైలర్ విడుదలకే అనుమతించని మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ సినిమా విడుదలకు సహకరిస్తుందని అనుకోవడం ఓ రకంగా అత్యాశే అవుతుంది. 'ది బెంగాల్ ఫైల్స్' సినిమాను పల్లవిజోషితో కలిసి అభిషేక్ అగర్వాల్ నిర్మించారు.

Also Read: Pawan kalyan Mashup: మనల్ని ఎవడ్రా ఆపేది.. సోషల్‌ మీడియా షేక్‌..

Also Read: Vaa Vaathiyaar: ఎంజీఆర్ ను అనుకరించబోతున్న కార్తీ...

Updated Date - Sep 02 , 2025 | 12:39 PM

THE BENGAL FILES Teaser: పవర్‌ఫుల్‌గా ‘ది బెంగాల్‌ ఫైల్స్‌’ టీజర్‌

The Bengal Files Trailer: ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ చూశారా ..

Vivek Agnihotri: 'ది బెంగాల్ ఫైల్స్' విడుదలకై రాష్ట్రపతికి వినతి...

Vivek Agnihotri : కశ్మీర్ ఫైల్స్ దర్శకుడి నుంచి మహాభారతం.. ఎన్ని భాగాలంటే !

Vivek Agnihotri: నేను అక్కడ ట్రైలర్ రిలీజ్ చేస్తా.. నన్నెవరు ఆపుతారో చూస్తా