సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tourist Family: సౌందర్య రజనీకాంత్ నిర్మాతగా...

ABN, Publish Date - Aug 28 , 2025 | 01:02 PM

టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు ఇప్పుడు హీరోగా మారిపోయాడు. అతను కథానాయకుడిగా రజనీకాంత్ కుమార్తె సౌందర్య ఓ సినిమాను ప్రారంభించారు.

Tourist Family Director as Hero

ఇటీవల విడుదలైన తమిళ చిత్రం 'టూరిస్ట్ ఫ్యామిలీ' (Tourist Family) చక్కని ఘన విజయం సాధించింది. సూర్య నటించిన 'రెట్రో' మూవీతో పోటీ పడిన ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అభిషన్ జీవింత్ (Abishan Jeevinth) కు మంచి గుర్తింపు వచ్చింది. తమిళనాడులోని రజనీకాంత్ (Rajinikanth) మొదలుకొని అగ్ర, యువ కథానాయకులంతా అభిషన్ ను ప్రత్యేకంగా అభినందించారు. 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీలో అభిషన్ ఓ కీలక పాత్రను పోషించి మెప్పించాడు. అతనితో మంచి నటుడు ఉన్నాడని గుర్తించిన రజనీకాంత్ కుమార్తె సౌందర్య... జియోన్ ఫిలిమ్స్, ఎం.ఆర్.పి. ఎంటర్ టైన్ మెంట్ తో కలిసి ఓ సినిమా నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు గురువారం జరిగాయి.


ఇప్పటికే అషిషన్ హీరోగా నటించబోతున్నాడని, అతని సరసన మలయాళీ నటి అనస్వర రాజన్ (Anaswara Rajan) హీరోయిన్ నటిస్తోందన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే... దానిని అధికారికంగా పూజా కార్యక్రమం రోజున సౌందర్య రజనీకాంత్ తెలిపారు. 'టూరిస్ట్ ఫ్యామిలీ'కి దర్శకత్వ శాఖలో పనిచేసిన మదన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సీన్ రోల్డన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు.

Also Read: Coolie and Lokah: ఫిల్మ్ మేకర్స్ తప్పు మీద తప్పు...

Also Read: Manushulu Mamathalu: జయలలిత తొలి తెలుగు సినిమాకు 'ఎ' సర్టిఫికెట్...

Updated Date - Aug 28 , 2025 | 01:03 PM