Tourist Family OTT: ఓటీటీకి టూరిస్ట్ ఫ్యామిలీ.. కడుపుబ్బా నవ్విస్తారు.. ఏడిపిస్తారు! ఎప్పటినుంచంటే
ABN , Publish Date - May 28 , 2025 | 01:58 PM
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఓ ఫ్యామిలీ, కామెడీ, ఎమోషనల్ డ్రామా, తమిళ సంచలనాత్మక చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ రెడీ అయింది.
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఓ ఫ్యామిలీ, కామెడీ, ఎమోషనల్ డ్రామా టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family) రెడీ అయింది. శశి కుమార్ (Sasikumar), సిమ్రన్ (Simran) జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న తమిళనాట విడుదలై సంచలన విజయం సాధించి అక్కడి అల్ టైం క్లాసిక్స్ సినిమాల జాబితాలో చేరింది. కేవలం రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం పదింతల లాభాలు తెచ్చింది. ప్రపంచ వ్యాప్తగా రూ.80 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి తమిళ సినిమా ఇండస్ట్రీకి మంచి కిక్ ఇవ్వడంతో పాటు ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అనే గుర్తింపును సాధించి పెట్టింది. ఇప్పుడీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. టాలీవుడ్ నుంచి రాజమౌళి వంటి అగ్ర దర్శకుడు ఈ సినిమాను చూసి ఆకాశానికెత్తేశాడంటే సినిమా ఆయనను ఎంతలా కదిలించిందో ఇట్టేఅఅర్ధమవుతుంది.
అబిషన్ జీవింత్ (Abishan Jeevinth) ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేయడమే కాక మూవీకి కథ కూడా అందించడం విశేషం. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే.. కొవిడ్ వళ్ల తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ధర్మదాస్, వాసంతి భార్యభర్తలు తమ పిల్లలతో కలిసి శ్రీలంక నుంచి అక్రమంగా భారత దేశానికి వచ్చి చెన్నైలో రకరకాల సమస్యలతో జీవితం వెళ్లదీస్తూ, పక్క వారితో సపంబంధాలు లేకుండా ఉంటున్న కుటుంబాలు నివసించే ఓ కాలనీలో అద్దెకు దిగాల్సి వస్తుంది. అక్కడికి వచ్చిన దాస్ ఫ్యామిలీ అక్కడి వారితో వ్యహరించిన తీరు, అక్కడి వారిలో తెచ్చిన మార్పులతో సినిమా అసాంతం నవ్వులు పూయిస్తూ సాగుతుంది. మనిషి ఎలా జీవించాలి, ఎదుటి వారితో ఎలా ఉండాలి అనే కాన్సెప్ట్‌తో సినిమా సాగుతూ చూసే ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేస్తుంది. అంతేగాక ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించే ఒకటి రెండు సన్నివేశాలు సట్్రాంగ్ గానే ఉన్నాయి.
ఇటీవల వస్తున్న మాష్,మసాలా, రొట్ట కొట్టుడ, బ్లడీ వయలెన్స్ సినిమాలను చూస్తు అలసిపోయిన, మోహం వాచిన వారికి ఈ సినిమా సమ్మర్‌లో షర్బత్, కూల్ డ్రింక్ వంటిది. మనషులుగా పుట్టిన వారు తోటి వారితో ఎలా మెలగాలని హస్యభరితంగా చెబుతూ ఎక్కడా బోర్ అనేది రాకుండా ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. ఇప్పుడీ చిత్రం జియో హాట్‌స్టార్ (Jio Hotstar) తో పాటు సింపుల్ సౌత్ ఓటీటీల్లో తమిళంతో పాటు తెలుగు ఇతర భాషల్లో జూన్2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఓ ఫీల్‌గుడ్ సినిమా కావానుకునే వారు, కుటుంబం అంతా కలిసి చూడాలనుకునే వారికి దీనిని మించిన చిత్రం మరోటి ఉండదు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా చూడడం మిస్ చేయకండి.