Abishan Jeevinth: హీరోగా.. టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు

ABN , Publish Date - Jul 08 , 2025 | 10:27 PM

తొలిసారి దర్శకత్వం చేపట్టి, టూరిస్ట్ ఫ్యామిలీ వంటి మెగా బ్లాక్బస్టర్ హిట్ అందించిన యువ దర్శకుడు అభిషన్ జీవింత్ హీరోగా కనిపించేందుకు రంగం సిద్ధ‌మైంది.

Abishan Jeevinth

తొలిసారి దర్శకత్వం చేపట్టి, టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family) వంటి మెగా బ్లాక్ బ‌స్టర్ హిట్ అందించిన యువ దర్శ కుడు అభిషన్ జీవింత్ (Abishan Jeevinth) వెండితెరపై హీరోగా కనిపించేందుకు రంగం సిద్ధ‌మైంది.

ద‌ర్శ‌కుడిగానే కాకుండా టూరిస్ట్ ప్యామిలీ మూవీలో ఓ పాత్రలో న‌టించి మంచి మార్కులు సైతం కొట్టేశాడు. రాజ‌మౌళి, ర‌జ‌నీకాంత్, సూర్య , నాని, ధ‌నుష్‌, శింబు వంటి ప్ర‌ముఖుల నుంచి ప్ర‌త్యేక‌ ప్ర‌శంస‌లు పొందాడు.

పైగా తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రమే భారీ హిట్‌గా నిలవ‌డంతో ఆయన దర్శకత్వం వహించే రెండో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

tourist.jpg

అయితే, తన రెండో చిత్రానికి తాను దర్శకత్వం వహించకుండా హీరోగా నటించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ సినిమాకు త‌న వ‌ద్ద అసిస్టెంట్‌గా ప‌ని చేసిన వ్య‌క్తి దర్శకత్వం వహించనున్నారు. హీరోయిన్‌గా మ‌ల‌యాళ బ్యూటీ ఆనస్వర రాజన్ (Anaswara Rajan)ను ఎంపిక చేసినట్టు సమాచారం.

Anaswara Rajan

ఈ మూవీకి 'కరెకైడ్ మచ్చీ (Corrected Machi) గానీ ప్లేమ్స్ అనే పేర్లు ఖరారు చేసే ప‌నిలో ఉన్నారు. ఈ విషయం కాస్తా బయటకు రాగానే సోషల్ మీడియా వేదికగా అభిషన్ కు పలువురు సినీ ప్రముఖులు ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు. అయితే, ఈ ప్రాజెక్టు నిర్మాత, నిర్మాణ సంస్థ తదితర పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Anaswara Rajan

Updated Date - Jul 08 , 2025 | 10:57 PM