Maargan OTT: ఓటీటీకి వచ్చేసిన.. అదిరిపోయే లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్
ABN, Publish Date - Jul 25 , 2025 | 06:22 AM
విజయ్ అంటోని కథానాయకుడిగా నటించగా గత నెలాఖరున థియేటర్లలోకి మంచి విజయం సాధించిన క్నైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం మార్గన్.
విజయ్ అంటోని (Vijay Antony) కథానాయకుడిగా నటించగా గత నెలాఖరున థియేటర్లలోకి మంచి విజయం సాధించిన క్నైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం మార్గన్ (Maargan). బ్రిగిడా సాగా (Brigida Saga), అజయ్ దిషాన్ (Ajay Dhishan), ప్రీతిక, సముద్రఖని (P. Samuthirakani) కీలక పాత్రల్లో నటించారు. లియో జాన్ పాల్ (Leo John Paul) రచించి దర్శకత్వం వహించాడు. విజయ్ అంటోని ఆయన భార్య ఈ మూవీని నిర్మించారు. ఇప్పుడీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు (OTT) వచ్చేసింది. నిరంతరం వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ వస్తున్న విజయ్‌కు ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో మంచి పేరును సంపాదించి పెట్టింది.
కథ విషయానికి వస్తే.. సినిమా ఆరంభమే.. రమ్య అనే యువతి హత్యకు గురై నల్లగా తయారైన ఆమె బాడీ ఓ కాలనీలో చెత్త కుప్పలో దొరుకుతుంది. దాంతో ఈ కేసు దేశవ్యాప్యంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసును డీల్ చేయడానికి ముంబై నుంచి ధ్రువ్ (విజయ్ ఆంటోని) అడిషనల్ డీజీపీగా హైదరాబాద్ వస్తారు. అయితే.. గతంలో తన కూతురు సైతం అదే పద్దతిలో మర్దర్ అవడంతో రమ్య కేసుపై మరింత దృష్టి పెడతారు. హత్యకు సంబంధించిన చిన్న చిన్న ఆధారాల సాయంతో అరవింద్ (అజయ్ దిశాన్) అనే కుర్రాడిని అదుపులోకి తీసుకొని విచారణ మొదలుపెడతాడు. అరవింద్.. వల్ల అమ్మాయిల హత్యలకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి. ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? వాటితో అరవింద్‌కు ఉన్న లింకేంటి, అతనికి ఉన్న సూపర్ పవర్ ఏంటి? మోడల్‌గా వెన్నెల ఎవరు? పోలీసాఫీసర్ ధ్రువ కూతురు హత్యకు కారణమేంటి? ఈ కేసు ధ్రువ్ ఎలా ఛేదించాడనేది మిగిలిన స్టోరి.
ఈ మార్గన్ కథ.. రోటీన్ అనిపించినా నడిపించిన విధానం మాత్రం ఆత్యంతం ఆకట్ట్ఉకుంటుంది. ఎక్కడా ఇగి సడలకుండా తర్వాత ఏం జరుగబోతుంది, అసలు విలన్ ఎవరు అనే పాయింట్‌ను చివరి వరకు రివీల్ చేయకుండా అఖరులో ఇచ్చే ట్విస్టు మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. అధేవిధఃగా అరవింద్ క్యారెక్టర్ ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్ అతను ఉన్నంత సేపు సినిమా అమాంతం ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. అతను క్లూస్ ఇచ్చే విధానం, జల స్తంభన విధ్య, వాటిని తెరకెక్కించిన విధానం ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో తమిళంతో పాటు తెలుగు ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. మంచి థ్రిల్లర్స్, క్రైమ్ ఇన్వేస్టిగేషన్ సినిమాలు ఇష్ట పడేవారు ఎట్టి పరిస్దితుల్లో మిస్సవకూడని సినిమా ఇది. ఇంటిల్లిపాది కలిసి ఈ చిత్రాన్ని చూసేయవచ్చు. ఎక్కడా ఎలాంటి అభ్యంతర కర సన్నివేశాలు లేవు. ఈ వీకెంట్కు బెస్ట్ మూవీ ఇది. నో డౌట్.