సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thammudu OTT: ఓటీటీకి వ‌స్తోన్న‌.. త‌మ్ముడు! జ‌నం కరుణించేనా

ABN, Publish Date - Jul 27 , 2025 | 09:15 PM

ఎన్నో అంచ‌నాల మ‌ధ్య ఇటీవ‌ల థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి నిరాశ ప‌ర్చిన చిత్రం త‌మ్ముడు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేస్తోంది.

OTT

ఎన్నో అంచ‌నాల మ‌ధ్య ఇటీవ‌ల థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి నెవ‌ర్ భిఫోర్ అనే లెవ‌ల్‌లో ప్రేక్ష‌కుల‌ను తీవ్రంగా నిరాశ ప‌ర్చిన చిత్రం త‌మ్ముడు (Thammudu). నితిన్ (Nitin), వ‌ర్ష బొల్ల‌మ్మ (Varsha Bollamma), స‌ప్త‌మి గౌడ (Sapthami Gouda), ల‌య (Laya) వంటి స్టార్ న‌టులు న‌టించిన ఈ చిత్రం ఏ విభాగంలోనూ ప్ర‌జ‌ల‌ను అల‌రించ‌క రెండు రోజుల‌కే థియేట‌ర్ల వ‌ద్ద చ‌తికిల ప‌డింది. సిద్ధార్థ్‌ ఓ మై ఫ్రెండ్‌, నాని మిడిల్ క్లాస్ మెలోడీస్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌కీల్ సాబ్ సినిమాల‌ను డైరెక్ట్ చేసిన వేణు శ్రీరామ్ (Sriram Venu) ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా దిల్ రాజు (Dil Raju) ఎంతో భారీ క‌ర్చుతో తెర‌కెక్కించారు. ఇప్పుడీ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేస్తోంది.

చిన్న‌ప్పుడే త‌ల్లి చ‌నిపోవ‌డంతో తానే అమ్మై త‌మ్ముడు జై ని ఏ లోటు లేకుండా పెంచుతుంది అక్క స్నేహలత (లయ). ఈ క్ర‌మంలో త‌ను ప్రేమించిన వ్య‌క్తిని పెళ్లి చేసుకోలేక పోయాన‌నే బాధ‌తో మ‌రొక‌రిని వివాహం చేసుకుని తండ్రికి, తమ్ముడికి దూరం అవుతుంది. అప్ప‌టి నుంచి ఒంట‌రిగానే ఉన్న జై పెద్దై అర్చ‌రీలో రాణిస్తాడు. కానీ త‌న అక్క జ్ఞాప‌కాల వ‌ళ్ల గోల్డ్ మెడల్ కొట్ట‌లేక పోతాడు. దీంతో త‌న అక్క‌ను వెతికే క్ర‌మంలో త‌ను ప్ర‌భుత్వ ఉద్యోగం చేస్తూ.. త‌న కుటుంబంతో ఓ అడ‌విలో క‌ఠిన ప్రాణాపాయ స్థితిలో చిక్కుకుంద‌ని తెలుసుకుని ఆమెను రంగంలోకి దిగుతాడు. ఈక్ర‌మంలో అక్క‌ను, వాల్ల కుటుంబాన్ని జై కాపాడాడా అందుకోసం అతను కోల్పోయిందేమిటీ? అనేది ఈ సినిమా కథ.

అయితే.. ఇది బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ కథే అయినా.. క‌థ‌లో అంత ఎమోష‌న్ మిస్స‌వ‌డం, చాలా క్యారెక్ట‌ర్లు ఉండ‌డం, వెంట వెంట‌నే వ‌చ్చే ఫైట్స్ వ‌ళ్ల ప్రేక్ష‌కులు నిరుత్సాహా ప‌డ‌క త‌ప్ప‌లేదు. హీరోతో పాటు వర్ష బొల్లమ్మ, లయ, సప్తమి గౌడ, స్వాపిక, సౌరభ్ సచిదేవ, బేబీ దిత్య.. వీళ్ళందరి పాత్రలను భిన్నంగా రాసుకున్నారు. వాటితో కథను రక్తికట్టించడంలో విఫలం అయ్యారు. ఇప్పుడీ చిత్రం అగ‌ష్టు 1 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ (OTT)లో తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ అవ‌నుంది. ఓపిక‌, ఎలా ఉన్నా చూడ‌గ‌లం అనుకునే వారు మాత్రం ఈ త‌మ్ముడు (Thammudu) మూవీని చూడ‌వ‌చ్చు.

Updated Date - Jul 27 , 2025 | 09:15 PM