Kingdom: కింగ్డ‌మ్ ట్రైల‌ర్‌.. అభిమానుల‌కు పూన‌కాలు

ABN , Publish Date - Jul 27 , 2025 | 02:08 PM

వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ వ‌చ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ కింగ్డ‌మ్ చిత్రం మ‌రో నాలుగు రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Kingdom

వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ వ‌చ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Devarakonda) కింగ్డ‌మ్ (Kingdom) చిత్రం మ‌రో నాలుగు రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ తాజాగా తిరుప‌తిలో ప్ర‌త్యేక ఈవెంట్ సైతం నిర్వ‌హించి ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ప్రారంభించారు. అంతేగాక ట్రైల‌ర్ విడుద‌ల చేసి విజ‌య్ అభిమానుల్లో, సినిమా ప్రియిల‌కు మ‌రింత ఉత్సాహం క‌లిగించారు. అయితే..లీజ్‌కు ముందే ఈ కింగ్డమ్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో హైప్ క్రియేట్ చేస్తోంది. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా తిరుపతిలో 40 అడుగుల కటౌట్స్, అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో స్టార్ట్ కావడం సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడున్నాయో అర్థ‌మ‌వుతోంది.

కాగా.. చాలా కాలంగా విజయ్ దేవరకొండ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ‘కింగ్డమ్’ ట్రైలర్ శ‌నివారం రాత్రి విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో హంగామా మొదలైంది. ట్రైల‌ర్‌పై రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా యావ‌త్ దేశం నుంచి చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. త‌మ అభిప్రాయాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంటున్నారు. ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను మించి ట్రైల‌ర్ ఉండ‌డంతో వారి ఆనందం ప‌ట్ట‌లేన్నంత‌గా ఉంది. ట్రైలర్ కట్ అదిరిపోయింద‌ని, విజువల్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పవర్‌ఫుల్ డైలాగ్స్, అనిరుధ్ మ్యూజిక్, హై విజువల్స్‌తో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో బ్లాక్‌బస్టర్ అవ్వడం కన్‌ఫామ్ అని ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా.. విజయ్ ఈ సినిమాలో రాయలసీమ యాసలో మాట్లాడటం సినిమాకే హైలైట్‌గా మారింది. “రాక్షసులందరికీ రాజుగా” అన్న డైలాగ్ ఇప్పటికే వైరల్ అవుతుండ‌గా.. ఈ డైలాగ్స్‌కి ఫుల్ విజిల్ ఫెస్ట్ అని థియేటర్స్ త‌గ‌ల‌బ‌డ‌తాయని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ట్రైలర్‌లో కనిపించిన విజువల్స్, డైలాగ్స్, మ్యూజిక్ అన్నీ ఫ్యాన్స్‌కు గూస్బమ్స్ తెప్పించాయి. ట్రైలర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అనిరుధ్ మ్యూజిక్ కిల్లర్… ట్రైలర్ సినిమా రేంజ్‌ను మ‌రో లెవెల్‌కి తీసుకెళ్లిందని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఫీల్‌గుడ్‌, ఎమోష‌న‌ల్ సినిమాలు తీసి అప‌జ‌యం ఎరుగ‌ని డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరి (Goutham Tinnanuri) టేకింగ్ అదిరిపోయింద‌ని, అత‌ని నుంచి ఈ త‌ర‌హా సినిమా ఊహించ‌లేద‌ని, సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ పెట్టిన ప్ర‌తీ రూపాయి క‌నిపిస్తోంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Kingdom

ఇంకా ట్రైల‌ర్‌లో అన్న కోసం త‌మ్ముడు చేసిన సాహాస యాత్ర‌, వారి బాండింగ్‌ను చూపిన విధానం, వారు ఒక‌రికి తెలియ‌కుండి మ‌రొక‌రు పోటీ ప‌డ‌డం త‌లుచుకుంటేనే పిచ్చెక్కుతుంద‌ని విజ‌య్ డైహార్డ్ ఫ్యాన్స్ త‌మ ట్వీట్ల‌తో హైప్ పెంచేస్తున్నారు. అయితేఇంత‌కు ముందు క‌న్నా ఈ చిత్రంలో విజ‌య్ హావ‌భావాల‌ విష‌యంలో మంచి మార్పు క‌నిపించింద‌ని డైలాగ్ డెలివ‌రీ విష‌యంలో ఇంకా కాస్త ప‌రిణితి సాధించాల్సి ఉంది అంటూ హిత‌వు ప‌లుకుతున్నారు.

మొత్తంగా చూస్తే.. ‘కింగ్డమ్’ ట్రైలర్‌తో విజయ్ దేవరకొండ మాస్ ఆడియన్స్‌ను, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఒకేసారి టార్గెట్ చేసిన‌ట్లు తెలుస్తోంది.. స్టైలిష్ యాక్షన్, పవర్‌ఫుల్ డైలాగ్స్, అనిరుధ్ మ్యూజిక్ ఇవన్నీ కలిసి బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ మ‌రో రేంజ్‌లో ఉండబోతుందని ట్రైలర్ చెప్ప‌క‌నే చెప్పింది. ఈ ట్రైల‌ర్ అనంత‌రం కింగ్డ‌మ్ (Kingdom) సినిమాపై అంచ‌నాలు ఆకాశాన్నంటాయి. సోషల్ మీడియాలో హడావుడి చూస్తుంటే, ఈ సినిమా పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అవుతుందని నెటిజన్లు ఫిక్స్ చేస్తున్నారు.

Kingdom

Updated Date - Jul 27 , 2025 | 02:23 PM