Ponnambalam: నా కష్టం.. పగవాడికి కూడా రాకూడదు
ABN , Publish Date - Jul 28 , 2025 | 10:09 AM
నా కష్టం పగవాడికి కూడా రాకూడదని తమిళ సినీ నటుడు పొన్నాంబళం (Ponnambalam) వ్యాఖ్యానించారు.
నా కష్టం పగవాడికి కూడా రాకూడదని తమిళ సినీ నటుడు పొన్నాంబళం (Ponnambalam) వ్యాఖ్యానించారు. రెండు కిడ్నీలు దెబ్బతినండంతో గత కొంత కాలంగా డయాలసిస్ చేయించుకుంటూ అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్వూలో పై విధంగా వ్యాఖ్యానిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. డయాలసిస్ జరిగే సమయంలో నాకు రెండు సార్లు సూదులతో రక్తం తీసి, ఆ తర్వాత డయాలసిస్ చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు దాదాపు 750 మార్లు సూదులు వేయించుకున్నాను. గత నాలుగేళ్ళుగా ఈ తంతు జరుగుతోంది.
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన శిక్ష ఏదంటే డయాలసిస్ మాత్రమే. ఇలాంటి కష్టం మన పగవాడికి కూడా రాకూడదు. మద్యానికి బానిస కావడం వల్లే ఈ పరిస్థితి అని వైద్యులు అంటున్నారు. కానీ, అలా అలవాటు కావడానికి మరో కారణం ఉంది. కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకునేందుకు ఎంతగానో కష్టపడ్డాను. నాకు పునర్జన్మనిచ్చింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).
ఆయనే నాకు భారీగా సాయం చేశారు. అలాగే కమల్ హాసన్ ఇతర నటీనటుల చల్లని చూపు, సాయం కారణంగా ఇపుడు బాగానే ఉన్నాను. ఈ పరిస్థితుల్లో నేను ఎవరినీ కష్టపెట్టదల్చుకోలేదు. ఒక సహాయకుడితో కలిసి ఓ ఇంట్లో జీవిస్తున్నాను. అనేక మంది ఆర్థిక సాయం చేసి ప్రాణబిక్ష పెట్టారు' అని పొన్నాంబళం పేర్కొన్నారు.
Also Read.. ఇవి కూడా చదవండి