Hari Hara Veeera Mallu: సరికొత్తగా.. వీరమల్లు వచ్చేశాడు! ఆ సీన్లు కట్.. కొత్తవి ఇన్
ABN , Publish Date - Jul 28 , 2025 | 08:40 AM
హరిహర వీరమల్లు సెకండాఫ్ కాస్త ఇబ్బందికరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మేకర్స్ వాటిపై దృష్టి పెట్టి సరి చేసే పనికి పూనుకున్నారు.
ఇటీవల థియేటర్‌కు వచ్చిన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) చిత్రం అడియన్స్ నుంచి మిశ్రమ స్పందనను రాబట్టింది. రిలీజైన అన్ని చోట్ల నుంచి మంచి కలెక్షన్లను రాబడుతున్న ఈ సినిమాకు సెకండాఫ్ కాస్త ఇబ్బందికరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మేకర్స్ వాటిపై దృష్టి పెట్టి వాటిని సరి చేసే పనికి పూనుకున్నారు. దీంతో ఇప్పుడు మూవీ సెకండాఫ్ విషయంలో అడియన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. నెగిటీవిటీ వ్యాపింప జేస్తున్న వారు సైతం సైలెంట్ అయ్యారు.పైగా సినిమా బావుందంటూ కితాబిస్తున్నారు. దీంతో ఇప్పుడు మరోమారు బ్లాక్‌బస్టర్ హరిహార వీరమల్లు (#BlockBusterHariHaraVeeraMallu) అంటూ నేషనల్ వైడ్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
అయితే.. మేకర్స్ కాస్త ఆలస్యంగానైనా మేల్కొని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడెక్కడ అయితే సినిమాలోని సన్నివేశాలపై విమర్శలు వచ్చాయో వాటిని ట్రిమ్ చేసి లేదా అప్‌డేట్ చేసి మొత్తం మూవీని సరికొత్తగా మార్చి కొత్త ప్రింట్‌ను ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు కొత్తగా కథకు అవసరమనిపించిన, మిస్సయిన సీన్లను కూడా జత చేశారు. దీంతో సినిమాపై ఇప్పటి వరకు వచ్చిన విమర్శలకు చిత్ర బృందం చెక్ పెట్టింది. ఇప్పుడు సినిమా చూసిన వారంతా ఆ చేసే పనేదో ముందే చేసి ఉంటే ఇంత రచ్చ జరిగేది కాదు, సింపుల్‌గా రూ.500 కోట్లు కొట్టేవారు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ముఖ్యంగా.. సినిమాలో కొండపై నుండి బండరాయి కింద పడే సన్నివేశాన్ని వేగం చేయగా పవన్ అండ్ టీమ్ గుర్రపు స్వారీ, పవన్ బాణం వేసే సీన్, రాజ ప్రాసాదంపై జెండా మార్చే సన్నివేశాలను పూర్తిగా తొలగించారు. అదేవిధంగా క్లైమాక్స్ అంధీ (తుఫాన్) సన్నివేశాలను ట్రిమ్ చేసి అర్థవంతంగా క్లైమాక్స్ వచ్చేలా చేశారు. ఇప్పటికే రీ ఎడిట్, అప్‌డేట్ చేసిన సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శిస్తుండగా ఫ్యాన్స్ నుంచే కాకుండా సామాన్య ప్రేక్షకుల నుంచి సైతం మంచి ఆదరణ వస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. చాలామంది మరొమారు సినిమాను చూసేందుకు రెడీ అయ్యారు.
Also Read.. ఇవి కూడా చదవండి