Sai Kumar: డైలాగ్ కింగ్ బర్త్ డే.. ఫస్ట్ లుక్ పోస్టర్ల సునామీ
ABN , Publish Date - Jul 27 , 2025 | 05:00 PM
నటుడు సాయికుమార్ పేరు తలచుకోగానే ముందు గుర్తుకు వచ్చేది ఆయన గంభీరమైన వాచకం.
నటుడు సాయికుమార్ (Sai kumar)పేరు తలచుకోగానే ముందు గుర్తుకు వచ్చేది ఆయన గంభీరమైన ఆకట్టుకునే వాచకం. ఆయన గళం నుండి జాలువారిన ప్రతి పదం ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. అందుకే ఆయనకు అభిమానులు ‘డైలాగ్ కింగ్’ బిరుదు ఇచ్చి కొనియాడారు.1960 జూలై 27న జన్మించిన సాయికుమార్ కుటుంబం సినీ రంగంతో అనుబంధం కలిగి ఉంది. ఆయన తండ్రి పి.జె.శర్మ తెలుగు సినీ రంగంలో నటుడిగా గుర్తింపు పొందారు. తనకందిన పాత్రల్లో నటిస్తూ, అనేక మంది పరభాషా నటులకు డబ్బింగ్ చెప్పి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించారు. అదే మార్గంలో సాయికుమార్ కూడా సాగడం విశేషం.
తన కెరీర్ ప్రారంభంలోనే సాయికుమార్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో హీరోలకు, ఇతర పాత్రలకు సైతం తన స్వరాన్ని అందించారు. ఆ తర్వాత హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో హిట్ సినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన శక్తివంతమైన డైలాగ్ డెలివరీ, భావప్రధానమైన నటన ఇప్పటికీ టాలీవుడ్‌లో అపూర్వం. అయితే.. ఆదివారం (జూలై 27)న సాయి కుమార్ జన్మదినం సందర్భంగా ఆయన నటించిన, నటిస్తోన్న సినిమాల నుంచి పోస్టర్లను మేకర్స్ ఆదివారం రిలీజ్ చేశారు.
ముఖ్యంగా ‘విరూపాక్ష’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత మెగా హీరో సాయి దుర్గా తేజ్ (Sai Durgha Tej) చాలా గ్యాప్ తీసుకుని నటిస్తున్న చిత్రం సంబరాల ఏటి గట్టు (Sambarala Yeti Gattu Carnage) చిత్రంలో ఆయన పోషించిన రాయప్ప లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
అంతేగాక సాయి కుమార్ నటిస్తున్న మరో ఆరేడు చిత్రాల నుంచి సాయి కుమార్ బర్త్ డే స్పెషల్ పోస్టర్స్‌ను ఆయ చిత్ర బృందాలు రిలీజ్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాయి.
వాటిలో.. అల్లరి నరేశ్ 12 ఏ రైల్వే కాలనీ, కిరణ్ అబ్బవరం కే ర్యాంప్, నాగ అశ్విన్ బ్యాడ్ బాయ్ కార్తీక్, ధర్మస్థల నియోజక వర్గం, మయసభ వెబ్ సిరీస్, కన్నడ తెలుగు సినిమాలు చౌకీదార్, సత్య హరిశచ్చంద్ర సినిమాల నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేశారు. ఇవేగాక సాయి కుమార్ ఇంకా తెలుగులో క్రిష్ కన్యాశుల్కం, రాజా ది రాజా, ఇన్‌స్పెక్టర్ యుగంధర్ ఇవేగా తెలుగులో, కన్నగ భాషల్లో మరో రెండేసి సినిమాలు చేస్తూ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.