Hari Hara Veera Mallu OTT: ఆ ఓటీటీకి.. వచ్చేస్తున్న వీరమల్లు! ఎప్పటినుంచంటే
ABN , Publish Date - Jul 28 , 2025 | 07:40 AM
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధం అవుతోంది.
చాలా గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన హరిహర వీర మల్లు (Hari Hara Veera Mallu) చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్‌తో ఫర్వాలేదని అనిపించుకుంటోంది. మూడేండ్ల తర్వాత పవన్ నటించిన చిత్రం అవడం, హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కావడం ఈ సినిమాకు మంచి హైప్ తీసుకు వచ్చాయి. అదీ గాక ఎన్నడు లేనిది పవన్ కల్యాణ్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఓ రేంజ్‌లో ప్రమోషన్స్ చేయడం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చి అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టింది. అయితే.. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధం అవుతోంది.
17వ శతాబ్దంలో నడిచే కథగా రూపొందిన ఈ చిత్రంలో కృష్ణా తీరంలో లభించిన కోహినూర్ వజ్రం అనేక రాజుల చేతులు మారి మొగలుల చెంతకు చేరుతుంది. అదే సమయంలో దొంగతనాలు చేస్తూ నాటి బ్రిటీష్ వాళ్లకు, పాలెగాళ్లకు సింహస్వప్నంలా మారతాడు వీరమల్లు. ఓ చోరీ విషయంలో నాటి కుతుబ్ షాహీ సైనికులకు చిక్కుతాడు. అయితే.. దక్కన్ ఆత్మ గౌరవానికి చిహ్నమైన కోహినూర్ వజ్రాన్ని మొగలుల వద్ద నుంచి తీసుకు వస్తే అడిగింది ఇస్తా, చేస్తా అని ఆ రాజు మాట ఇవ్వడంతో ఢిల్లీ ప్రయాణం స్టార్ట్ చేస్తాడు. ఈక్రమంలో వీరమల్లుకు ఎదురైన ఘటనలు, అదే సమయంలో హిందువులపై జరుగుతున్న దాడుల విషయంలో ఏం చేశాడు, అసలు వీరమల్లు ఎవరు, అతని వెనక దాగి ఉన్న రహస్యం ఏంటి, చివరకు ఔరంగజేబుకు ఎదురు పడ్డాడా లేదా అనే పాయింట్ సినిమా సాగుతుంది.
ఇదిలా ఉంటే.. చెప్పుకోవడానికి అదిరిపోయేలా ఉన్న ఈ స్టోరీ ఫస్టాఫ్ వరకు ఫుల్ హై ఇస్తూ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ వడ్డించింది. ఆ తర్వాత ఢిల్లీ టూర్ మొదలైనప్పటి నుంచి కథ కొత్త టర్న్ తీసుకోవడం, ఆ సమయంలో వచ్చే గ్రాఫిక్స్ సినిమాకు మైనస్ అయ్యాయి. పాటలు, నటీనటులు అంతా సెట్ అయ్యాయి, ముఖ్యంగా కీరవాణి సంగీతం ఈ సినిమాకు సెకండ్ హీరో అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా బోర్ కొట్టనప్పటికీ అసలు మ్యాటర్‌కు వెళ్ళక పోవడమే కాస్త నిరూత్సాహ పరుస్తుంది. అయితే రిలీజ్ అనంతరం గ్రాఫిక్స్‌పై వచ్చిన విమర్శల నేపథ్యంలో మేకర్స్ పలు జాగ్రత్తలు తీసుకుని కొత్త సీన్లు కలపడంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ అప్‌డేట్ చేసి సినిమాను మరింత ఇంట్రెస్టింగ్ మలిచి థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడీ చిత్రం ఆగష్టు 21 గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video) లో స్ట్రీమింగ్‌కు రానుంది.
Also Read.. ఇవి కూడా చదవండి