సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thamma: రశ్మిక మందణ్ణ 'థామా' రన్ టైమ్ ఎంతంటే...

ABN, Publish Date - Oct 18 , 2025 | 01:38 PM

రశ్మిక మందణ్ణ, ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్న 'థామా' సినిమా ఈ నెల 21న విడుదల కాబోతోంది. దీనికి సెన్సార్ అధికారులు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు.

Thama movie

బాలీవుడ్ క్రేజీ హీరో ఆయుష్మాన్ ఖురానా, నేషనల్ క్రష్ రశ్మిక మందణ్ణ నటిస్తున్న 'థామా' సినిమా పాన్ ఇండియా స్థాయిలో దీపావళి కానుకగా ఈ నెల 21న జనం ముందుకు రాబోతోంది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ హారర్ మూవీకి 'యు/ఎ' సర్టిఫికెట్ లభించింది. పెద్దలతో కలిసి పిల్లలు చూసే ఆస్కారం ఉన్న ఈ సినిమా 16 సంవత్సరాల పైబడిన వారిని ఉద్దేశించిందనే అభిప్రాయం వ్యక్తం చేసింది సీబీఎఫ్సీ.

'థామా' సినిమాలో కొన్ని మాటలను సీబీఎఫ్సీ మ్యూచ్ చేసింది. చారిత్రక, పౌరాణిక పదాలు 'అలెగ్జాండర్, సికందర్, అశ్వద్థామ' వంటి వాటిని తొలగించింది. అలానే లిప్ లాక్ సీన్ ను 30 శాతానికి తగ్గించమని పేర్కొంది. దీనితో పాటు రక్తాన్ని తాగే సమయంలో వచ్చే సౌండ్ ను కూడా మినిమైజ్ చేయమని కోరింది. ఈ మార్పులకు మేకర్స్ అంగీకరించడంతో 'యు/ఎ' సర్టిఫికెట్ ను ఇష్యూ చేసింది. 'థామా' మూవీ రన్ టైమ్ ను 2గంటల 30నిమిషాలకు మేకర్స్ లాక్ చేశారు.


తెలుగులో దీపావళి సందర్భంగా విడుదలైన మరో మూడు చిత్రాలకు యు/ఎ సర్టిఫికెటే వచ్చింది. అయితే బోల్డ్ కంటెట్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కారణంగా కిరణ్ అబ్బవరం నటించిన 'కె-ర్యాంప్'కు మాత్రం 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పటికే తెలుగులో దీపావళి పండగ సందర్భంగా 'మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్, కె- ర్యాంప్' చిత్రాలు జనం ముందుకు వచ్చాయి. ఇక రశ్మిక మందణ్ణ నటించిన 'థామా' కూడా ఈ నెల 21న విడుదలైపోతే... దీపావళి చిత్రాలలో దేనిది పైచేయి అనేది తేలిపోతుంది.

Also Read: OG: నాలుగు వారాలకు ఓటీటీలో...

Also Read: Tollywood: నిజాయితీపరుడైన శ్రీరామ్ గా... శివాజీ...

Updated Date - Oct 18 , 2025 | 01:43 PM