Rashmika - VD: విజమ్‌-రష్మిక నిశ్చితార్థం.. టీమ్‌ ఏమన్నారంటే!

ABN , Publish Date - Jan 08 , 2024 | 05:10 PM

విజయ్‌ దేవరకొండ, నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని చాలాకాలంగా వార్తలొస్తున్నాయి. తాజాగా ఓ అడుగు ముందుకేసి ఏకంగా నిశ్చితార్థం వరకూ వెళ్లిపోయారంటూ పలు మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Rashmika - VD: విజమ్‌-రష్మిక నిశ్చితార్థం.. టీమ్‌ ఏమన్నారంటే!

విజయ్‌ దేవరకొండ, నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని చాలాకాలంగా వార్తలొస్తున్నాయి. తాజాగా ఓ అడుగు ముందుకేసి ఏకంగా నిశ్చితార్థం వరకూ వెళ్లిపోయారంటూ పలు మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో ఈ జంట నిశ్చితార్థం జరగనుందంటూ కథనాలు పలు వెబ్‌సైట్స్‌లో దర్శనమిచ్చాయి. తాజాగా ఈ విషయంలో స్పష్టత వచ్చింది. నెట్టింట వైరల్‌గా మారిన ఈ కథనాలపై విజయ్‌ టీమ్‌ను సంప్రదించగా... అందులో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఎవరూ వాటిని నమ్మవద్దని తెలిపారు.

‘గీత గోవిందం’, చిత్రం కోసం వీరిద్దరై తొలిసారి జత కట్టారు. ఆ తర్వాత ుడియర్‌ కామ్రేడ్‌’లో మరోసారి కలిసి నటించారు. వరుసగా రెండు చిత్రాల్లో నటించడంతో ఇద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగింది. ఇద్దరూ కలిసి టూర్స్‌, డిన్నర్స్‌కు వెళ్తుండటంతో ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గతంలో ప్రచారం జరిగింది. మేమిద్దరం స్నేహితులం మాత్రమే అంటూ పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు. అయినా ఆ గాసిప్స్‌ ఆగలేదు.

ఇటీవల రష్మిక ‘యానిమల్‌’తో చక్కని విజయం అందుకుంది. పస్తుతం ఆమె ‘పుష్ప 2’లో నటిస్తున్నారు. ‘ఖుషి’ తర్వాత విజయ్‌ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్‌’లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి పరశురామ్‌ దర్శకుడు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. గౌతమ్‌ తిన్ననూరితో మరో ప్రాజెక్ట్‌ చేస్తున్నారు విజయ్‌.

Updated Date - Jan 08 , 2024 | 05:10 PM