OG: నాలుగు వారాలకు ఓటీటీలో...

ABN , Publish Date - Oct 18 , 2025 | 01:13 PM

పవన్ కళ్యాణ్‌ ఓజీ సినిమా ఈ నెల 23 నుండి ఐదు భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. థియేట్రికల్ గా ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది.

OG Movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan) 'ఓజీ' (OG) మూవీ సెప్టెంబర్ 25న విడుదలైంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన బజ్ ఎందుకో ఇతర రాష్ట్రాలలో రాలేదు. పైగా చిత్ర బృందం కూడా పనికట్టుకుని ఏ రాష్ట్రంలోనూ పబ్లిసిటీ చేయలేదు. సినిమాను ఐదు భాషల్లో విడుదల చేశామనిపించింది అంతే. అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్ 11 రోజుల్ల రూ. 308 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, పవన్ కళ్యాణ్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ వసలూ చేసిన సినిమాగా టాప్ పొజిషన్ లో నిలిచింది. ఇప్పుడీ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 23న ఐదు భారతీయ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అంటే సినిమా విడుదలైన నాలుగు వారాల్లో 'ఓజీ' ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సందడి చేయబోతోందన్న మాట. మరి ఇప్పుడైనా ఈ సినిమాకు ఇతర భాషల్లో ఆదరణ లభిస్తుందేమో చూడాలి.

Updated Date - Oct 18 , 2025 | 01:13 PM