Rashmika Madanna: ‘డీమన్‌ స్లేయర్' ఫ్యాన్స్‌ స్క్రీనింగ్ లో  రష్మిక హల్‌చల్‌..

ABN , Publish Date - Sep 08 , 2025 | 05:54 PM

అనిమే అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైుబా ఇన్ఫినిటీ క్యాసిల్‌’ ప్రత్యేక ఫ్యాన్స్ స్క్రీనింగ్ ముంబైలో ఘనంగా నిర్వహించారు.

Rashmika And Tiger shroff

అనిమే అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైుబా ఇన్ఫినిటీ క్యాసిల్‌’ ప్రత్యేక ఫ్యాన్స్ స్క్రీనింగ్ ముంబైలో ఘనంగా నిర్వహించారు. క్రంచిరోల్‌, సోనీ పిక్చర్స్‌ ఎంటర్టైన్‌మెంట్‌ ఇండియా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు.  రష్మిక మందన్నా, టైగర్‌ ష్రాఫ్‌ ఈ ప్రీమియిర్‌కి హాజరై సందడి చేశారు. అనిమే ఫ్యాన్స్‌తో మాట్లాడార్డు టైగర్‌ ఈ చిత్రంలో తన ఫేవరిట్‌ సీన్‌ ‘జెనిట్సు కైగాకు’ అని చెప్పారు. సినిమాలో తనకు నచ్చిన సన్నివేశాల గురించి చెప్పారు.

అలాగే అభిమానులకు నచ్చిన సీన్ల గురించి అడిగి తెలుసుకున్నారు. సెప్టెంబర్‌ 12న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. 750కి పైగా స్ర్కీన్లలో జపనీస్‌, ఇంగ్లిష్‌, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. భారతదేశంలోనే అత్యంత పెద్ద అనిమే థియేట్రికల్‌ రిలీజ్‌గా నిలిచే ఈ చిత్రం, అనిమే ప్రేమికులకు తప్పకుండా నచ్చుతుందని మేకర్స్‌ చెప్పారు.

Updated Date - Sep 08 , 2025 | 05:54 PM