Tollywood: నిజాయితీపరుడైన శ్రీరామ్ గా... శివాజీ...
ABN , Publish Date - Oct 18 , 2025 | 11:44 AM
నటుడు శివాజీ మరోసారి నిర్మాతగా మారారు. శివాజీ, లయ జంటగా ఈ సినిమాను సుధీర్ శ్రీరామ్ తెరకెక్కిస్తున్నారు. దీపావళి పండగ సందర్భంగా ఈ సినిమా నుండి శివాజీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.
గతంలో హీరో శివాజీ (Shivaji) కన్నడ చిత్రం 'తాజ్ మహల్' (Taj Mahal) ను తెలుగులో రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నారు. ఆ తర్వాత సినిమా నిర్మాణానికి దూరమయ్యారు. అయితే ఇప్పుడు మరోసారి ఆయన నిర్మాతగా సాహసం చేస్తున్నారు. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాలో ఆయన జంటగా లయ (Laya) నటిస్తోంది. సుధీర్ శ్రీరామ్ ఈ చిత్రాని రచన, దర్శకత్వం చేస్తున్నారు. ఈటీవీ విన్ లో శివాజీతో కలిసి నైన్టీస్ వెబ్ సీరిస్ లో నటించిన బాల నటుడు రోహర్, అలీ, ధనరాజ్ ఇందులోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ తాజా చిత్రంలో శివాజీ పంచాయితీ సెక్రెటరీ శ్రీరామ్ గా నటిస్తున్నాడు. తప్పుని సమర్థించలేని మనస్తత్త్వం, అన్యాయాన్ని సహించలేని వ్యక్తిత్వానికి మారుపేరుగా ఆయన పాత్ర ఉండబోతోంది. తన వల్ల మాత్రమే కాదు, ఏ ఒక్కరి వల్ల కూడా జనం ఇబ్బంది పడకూడదని ఆలోచించే పాత్ర అది. భార్య బిడ్డలే ప్రపంచంగా బతికే అతని జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల సమాహారం ఈ సినిమా. దీపావళి పండగ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. గ్రామీణ వాతావరణం ఆ పోస్టర్ లో కనిపిస్తోంది. దీపావళి సందర్భంగా కొత్త బట్టలు కట్టుకుని ఇంటికి దీపావళి పటాసులు తీసుకు వస్తున్నట్టుగా శివాజీ అందులో ఉన్నారు.
Also Read: Pavala Syamala : అద్దె ఇంటి నుండి అనాథ ఆశ్రమానికి... ఇప్పుడు హాస్పిటల్ కు...
Also Read: Devisri Prasad: హీరోగా మ్యూజిక్ మిసైల్... హీరోయిన్ కూడా ఫిక్స్