సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Allu Arjun: దీపిక పాత్ర తగ్గిపోయిందా...

ABN, Publish Date - Sep 30 , 2025 | 03:16 PM

దీపికా పదుకొణే పై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వస్తున్నాయి. తనను హిందీ రంగానికి పరిచయం చేసిన ఫరాఖాన్ తో ఆమెకు పడటం లేదని అంటున్నారు. అలానే అల్లు అర్జున్ మూవీలోనూ దీపికా పదుకొణే పాత్రను కుదించారని తెలుస్తోంది.

Deepika Padukone

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే (Deepika Padukone) 'కల్కి 2898 ఎ. డి.' (Kalki 2898 A.D.) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఇప్పుడు దాని సీక్వెల్ లో ఆమెకు చోటు లేదు. మేకర్స్ ఆమెను ఈ సినిమా నుండి తొలగించారు. అలానే ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న 'స్పిరిట్' (Spirit) మూవీ నుండి కూడా దీపికా పదుకొణేను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీసేశారు. ఆ సమయంలో చాలామంది దీపికను వెనకేసుకు వచ్చారు. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ను మరికొందరు తప్పుపట్టారు. ఆమె కథను లీక్ చేసిందని, పని గంటల విషయంలో నిబంధనలు విధించిందని సందీప్ రెడ్డి అప్పట్లో వాపోయారు. ఆమెను ప్రాజెక్ట్ నుండి పంపేయడానికి అదే కారణమని అన్నారు. అయితే... ఎప్పుడైతే 'కల్కి 2898 ఎ.డి.' సీక్వెల్ నుండి నిర్మాత అశ్వనీదత్... దీపికాను తొలగించడంతో ఆమెను విమర్శించే వారి శాతం పెరిగింది.


ఈ రెండు ప్రాజెక్ట్స్ నుండి ఆమెను బయటకు పంపేసిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), అట్లీ (Atlee) మూవీ మీద పడింది. ఇప్పటికే ఆ సినిమాలో దీపికా పదుకొణే నటిస్తోంది. కొన్ని కీలక సన్నివేశాలను ఆమెపై చిత్రీకరించారు. ఆమెను ఎంపిక చేసినప్పుడు కూడా ఓ స్పెషల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే తాజా సమాచారం ఏమిటంటే... ఈ సినిమాలో దీపికా పదుకొణే పాత్రను వీలైనంత తగ్గించారనే పుకార్లు ఫిల్మ్ నగర్ లో షికారు చేస్తున్నాయి. దీపికా పదుకొణే ఆంక్షలకు తలొగ్గి మేకర్స్ నడుచుకుంటున్నారని, అయితే ఆమె పాత్ర నిడివిని తగ్గించి, మమ అనిపించబోతున్నారని తెలుస్తోంది. దాదాపు 800 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణానికి అంతరాయం కలగకుండా మేకర్స్ జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు.

ఇదిలా ఉంటే... దీపికా పదుకొణేపై ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఆమె ఓ టీవీ షోలో మాట్లాడుతూ, పరోక్షంగా దీపికా పదుకొణేను ఉద్దేశించి, 'ఇప్పుడా హీరోయిన్ ఈ షోకు టైమ్ కేటాయించలేదు, ఎందుకంటే ఆమె రోజుకు ఎనిమిది గంటలే షూటింగ్ లో పాల్గొంటుంది' అని చెప్పింది. దీపికా పదుకొణే గురించి ఫరాఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలను దీపికా అభిమానులు తప్పు పడుతున్నారు. కొందరైతే ఫరాఖాన్ వ్యాఖ్యలతో ఆగ్రహించిన దీపికా పదుకొనే సోషల్ మీడియాలో ఆమెను అన్ ఫ్రెండ్ చేసిందని తెలిపారు. అలానే ఫరాఖాన్ సైతం దీపికను అన్ ఫ్రెండ్ చేసిందని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.


ఈ విషయంలో ఫరా ఖాన్ స్పందించారు. 'దీపికా, తాను ఎప్పుడూ సోషల్ మీడియాలో ఒకరికి ఒకరు ఫాలోయర్స్ గా లేమ'ని అన్నారు. 'హ్యాపీ న్యూ ఇయర్' షూటింగ్ సమయంలోనే సోషల్ మీడియా ద్వారా కాకుండా ఇద్దరం వ్యక్తిగతంగానే ఏ అంశాల గురించి అయినా మాట్లాడుకోవాలని అనుకున్నామని, అందుకే ఒకరికి ఒకరు శుభాకాంక్షలను సోషల్ మీడియా ద్వారా కూడా తెలుపమని అన్నారు. దీపికా పదుకొణేకు సోషల్ మీడియా ద్వారా విషెస్ చెబితే నచ్చదని ఫరా ఖాన్ తెలిపారు. ఫరాఖాన్ దర్శకత్వం వహించిన 'ఓం శాంతి ఓం' మూవీ ద్వారానే దీపికా పదుకొణే బాలీవుడ్ కు పరిచయం అయ్యింది. కానీ ఇప్పుడు వీరిద్దరి మధ్య అంత సఖ్యత లేదని తెలుస్తోంది. ఏదేమైనా... దీపికా పదుకొణే విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏది నిజం, ఏది అబద్ధం అనేది తెలియక అభిమానులు అసహనానికి గురౌతున్నారు.

Also Read: Mammootty health update: త్వరలోనే సెట్‌లోకి.. టీమంతా హ్యాపీ..

Also Read: Urvashi Rautela: ఈడీ కార్యాలయానికి ఊర్వశీ రౌతేల

Updated Date - Sep 30 , 2025 | 03:16 PM