Mammootty health update: త్వరలోనే సెట్‌లోకి.. టీమంతా హ్యాపీ..
ABN , Publish Date - Sep 30 , 2025 | 02:51 PM
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే! చికిత్స పొందుతున్న ఆయన ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు.
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి (Mammootty) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే! చికిత్స పొందుతున్న ఆయన ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. తిరిగీ సినిమా సెట్‌లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని ‘పేట్రియాట్’ చిత్ర దర్శకుడు మహేశ్ నారాయణన్ తెలిపారు. జూన్‌లో ఆయన అనారోగ్యానికి గురయ్యారంటూ వార్తలొచ్చాయి. దీంతో అభిమానులు ఆందోళన చెందారు. ఆ వార్తలను ఆయన టీమ్ ఖండించింది. దీనిపై ఆయన స్నేహితుడు క్లారిటీ ఇచ్చారు. మమ్ముటీ ఆరోగ్యం బాగా లేదన్నమాట వాస్తవమే కానీ.. అది చాలా చిన్న సమస్య అని వివరించారు. (Mammootty health update)
పేట్రియాట్ (Patriot movie) చిత్రంలో మమ్ముట్టి, మోహన్‌లాల్, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రధారులు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యాక మమ్ముట్టి ఆరోగ్య సమస్య కారణంగా కొన్ని రోజులు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. తాజాగా ఆయన హెల్త్‌పై దర్శకుడు అప్‌డేట్ ఇచ్చారు. ‘అక్టోబర్ 1 నుంచి ఆయన సెట్స్‌లోకి రానున్నారు. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. ఆయన రెస్ట్ తీసుకుంటూ కూడా సినిమా గురించే ఆలోచించేవారు. ఇన్ని నెలలుగా ఆయన విరామం తీసుకున్నప్పటికీ సినిమా షూటింగ్‌పై ఎలాంటి ప్రభావం పడలేదు. ప్రతిరోజూ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చాను. ఆయన లోకేషన్‌లో లేకపోయినప్పటికీ ఎప్పుడూ సినిమా గురించి ఆలోచిస్తూనే షూటింగ్‌లో పాల్గొంటూనే ఉన్నారు’ అని అన్నారు.
ALSO READ: Chiranjeevi - OG Review: మెగా ఫ్యాన్స్‌కి ట్రీట్..
Tollywood: ఇప్పుడు హెచ్.డి. ప్రింట్స్ తో సినిమా వచ్చేస్తోంది
Avatar 2: అవతార్ 2.. మంత్ర ముగ్దులవుతారు..
Mega Fans: బాలయ్యపై ఫిర్యాదు.. తరలి వచ్చిన మెగా అభిమానులు