Naa Saami Ranga: కింగ్ నాగ్ ‘నా సామిరంగ’ ట్విట్టర్ రివ్యూ.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!

ABN , Publish Date - Jan 14 , 2024 | 11:17 AM

కింగ్ నాగార్జున, ఆషికా రంగనాధ్ హీరోహీరోయిన్లుగా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘నా సామిరంగ’. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలలో నటించగా.. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. సంక్రాంతి కానుకగా నేడు (జనవరి 14) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా చూసిన వారు ట్విట్టర్‌ వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Naa Saami Ranga: కింగ్ నాగ్ ‘నా సామిరంగ’ ట్విట్టర్ రివ్యూ.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!
Naa Saami Ranga Movie Poster

కింగ్ నాగార్జున (King Nagarjuna), ఆషికా రంగనాధ్ (Ashika Ranganath) హీరోహీరోయిన్లుగా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని (Vijay Binni) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘నా సామిరంగ’ (Naa Saami Ranga). అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. సంక్రాంతి కానుకగా నేడు (జనవరి 14) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చింది. సంక్రాంతికి బీభత్సమైన పోటీ ఉన్నప్పటికీ.. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ‘నా సామిరంగ’ అంటూ కింగ్ బరిలోకి దూకేశారు. సంక్రాంతి బరిలో చివరి చిత్రంగా వచ్చిన ఈ సినిమా షోస్ ఇప్పటికే పడ్డాయి. సినిమా చూసిన వారు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే.. (Naa Saami Ranga Twitter Talk)

‘‘ ‘నా సామిరంగ’ సినిమా చూశా. హిట్టు బొమ్మ. ప్రభలతీర్థ ఫైట్ అదిరిపోయింది. అంజి పాత్ర సూపర్బ్‌గా ఉంది. నాగార్జున ఫెంటాస్టిక్‌గా చేశారు. ఇంకా ఇతర నటీనటులు కూడా బాగా చేశారు. కానీ ఈ సినిమాకు రియల్ హీరో మాత్రం కీరవాణి గారే. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ చాలా బాగుంది. హనుమాన్ తర్వాత ఆప్షన్ నా సామిరంగ సినిమానే. ఈ సినిమాకు నా రేటింగ్ 3’’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. (Naa Saami Ranga Twitter Review)


‘‘నాగ్ ఇంట్రడక్షన్, అల్లరి నరేష్ పెర్ఫార్మెన్స్, నాగ్-ఆషికల మధ్య వచ్చే సీన్స్, ఇంటర్వెల్ బ్లాక్ బాగున్నాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా ఎమోషనల్‌గా సాగింది. స్క్రీన్‌పై పాటలు బాగున్నాయి. అన్ని కరెక్ట్‌గా సెట్ అయ్యాయి.. ఇక ఆడియెన్స్ చేతిలో ఉంది ఈ సినిమా రేంజ్. నా సామిరంగ హిట్టు బొమ్మ’’ అంటూ ఓ నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. (Naa Saami Ranga Movie)


ఫస్టాప్ పూర్తయింది.. రాంప్ అంతే. సింపుల్ స్టోరీనే కానీ చాలా బాగా తెరకెక్కించారు... అని ఓ నెటిజన్ పేర్కొన్నారు.


ఇప్పుడే సినిమా చూశా. పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్మ్ ఇది. ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు.. అని ఓ నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.


నా సామిరంగ రివ్యూ: సెకండాఫ్ యావరేజ్. ఒక మంచి ఎమోషనల్ సీన్- సాంగ్స్ అంత గొప్పగా ఏం లేవు- ఊహించే విధంగానే ఉన్న క్లైమాక్స్.. అంతే... అని ఓ నెటిజన్ రియాక్ట్ అయ్యారు.


నా జీవితంలో నాగార్జునని స్ర్కీన్‌పై మాస్‌గా చూడటం ఇదే తొలిసారి. సెకండాఫ్ ఊరమాస్ అంతే. ఎలివేషన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రాంపేజ్. ప్రీ క్లైమాక్స్‌లో ఎలివేషన్స్ అండ్ సీన్స్ కేక. క్లైమాక్స్ ఫైట్ అదిరిపోయింది. కీరవాణి అదరగొట్టారు. వెరీ వెరీ గుడ్ అవుట్‌పుట్.


ఇలా.. మొత్తంగా అయితే ‘నా సామిరంగ’ సినిమాకు ఇప్పటి వరకు అయితే పాజిటివ్ టాకే వినబడుతోంది. ఒకరిద్దరు మినహా అంతా పాజిటివ్‌గానే రెస్పాండ్ అవుతున్నారు. అసలు సినిమా పరిస్థితి ఏమిటనేది కాసేపట్లో వచ్చే రివ్యూలో తెలుసుకుందాం.


ఇవి కూడా చదవండి:

====================

*నిర్మాత వివేక్ కూచిభొట్ల‌ను బెదిరిస్తోన్న సినీ రచయితపై కేసు నమోదు

************************

*‘హను-మాన్’కు థియేటర్లు ఇవ్వని వారిపై TFPC సీరియస్

***********************

*Guntur Kaaram: ‘గుంటూరు కారం’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఇది, మహేష్ బాబు స్టామినా!

**************************

*Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆ అప్డేట్ కూడా వచ్చేసింది

************************

*‘హను-మాన్’ రెస్పాన్స్ చూసి.. గూస్ బంప్స్ వస్తున్నాయట..

************************

Updated Date - Jan 14 , 2024 | 11:17 AM