నిర్మాత వివేక్ కూచిభొట్ల‌ను బెదిరిస్తోన్న సినీ రచయితపై కేసు నమోదు

ABN , Publish Date - Jan 13 , 2024 | 06:29 PM

రచయిత రాజసింహపై.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సహ నిర్మాత‌గా వ్యవహరించే నిర్మాత వివేక్ కూచిభొట్ల జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు రచయిత రాజసింహపై కేసు నమోదు చేశారు. కొన్నాళ్లుగా తనని రాజసింహ బెదిరిస్తున్నాడని, నా పిల్లలకు భవిష్యత్‌‌తో ఆడుకుంటానని, అలాగే తన ఫ్యామిలీ మెంబర్స్‌పై అసభ్యకరమైన పదజాలంతో దుర్భాషలాడుతున్నాడని వివేక్ కూచిభొట్ల ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.

నిర్మాత వివేక్ కూచిభొట్ల‌ను బెదిరిస్తోన్న సినీ రచయితపై కేసు నమోదు
Producer Vivek Kuchibotla

టాలీవుడ్‌కు చెందిన రచయిత రాజసింహ (Rajasimha)పై.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (Peopel Media Factory) బ్యానర్‌లో వచ్చే సినిమాలకు సహ నిర్మాత‌గా వ్యవహరించే నిర్మాత వివేక్ కూచిభొట్ల (Vivek Kuchibhotla) జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు రచయిత రాజసింహపై కేసు నమోదు చేశారు. కొన్నాళ్లుగా తనని రాజసింహ బెదిరిస్తున్నాడని, నా పిల్లలకు భవిష్యత్‌‌తో ఆడుకుంటానని, అలాగే తన ఫ్యామిలీ మెంబర్స్‌పై అసభ్యకరమైన పదజాలంతో దుర్భాషలాడుతున్నాడని వివేక్ కూచిభొట్ల ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

వివేక్ కూచిభొట్ల తన ఫిర్యాదులో పేర్కొన్న విషయాన్ని గమనిస్తే.. కొంతకాలం క్రితం రాజసింహ తన దగ్గర ఉన్న కథలతో ఆయనని సంప్రదించాడు. అయితే ఆ కథలేవీ కార్యరూపం దాల్చలేదు. దీంతో వివేక్‌ని టార్గెట్ చేస్తూ రాజసింహ మెసేజ్‌లతో విసిగించడం మొదలెట్టాడు. ఆ మెసేజ్‌లలో ఫ్యామిలీ మెంబర్స్‌ని ఇన్‌వాల్వ్ చేస్తూ దుర్భాషలాడుతూ వస్తుండటంతో.. వార్నింగ్ ఇవ్వాలని కాల్ చేస్తే.. తన బలహీన స్థితిని రాజసింహ వ్యక్తం చేశాడు. అతని వివాహంలో ఏర్పడ్డ విభేదాలు, కుటుంబం విచ్ఛిన్నం కావడం వంటి విషయాలతో డిస్టర్బ్ అయిన తను అలా ప్రవర్తించాల్సి వచ్చిందని చెబుతూ.. రాజసింహ క్షమాపణలు కోరాడు. అంతటితో రాజసింహ గోల వదలిందని వివేక్ అనుకున్నారు కానీ.. మళ్లీ సంబంధాలు మొదలయ్యాయి. ప్రాణ అవసరం అంటే రూ. లక్ష రూపాయల ఆర్థిక సహాయం కూడా చేశారు వివేక్. అంతేకాకుండా, తను కోలుకున్న తర్వాత తన కంటెంట్ టీమ్‌కు అతడిని దగ్గర చేశారు. (Vivek Kuchibhotla Filed Case on Writer Rajasimha)


అయితే రాజసింహ చెప్పిన కథలు ఆ కంటెంట్ టీమ్‌కు కూడా నచ్చలేదు. మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. ఇండస్ట్రీలో ఓ ప్రముఖ రచయిత, దర్శకుడిని పరిచయం చేయాలంటూ ఒత్తిడి చేయడం మొదలు పెట్టాడు. ఇంకా.. కాంబినేషన్‌లు కాదు, మంచి కథలను ఎన్నుకోవడంపై దృష్టి పెట్టాలంటూ రకరకాలుగా మెసేజ్‌లతో వివేక్‌ని విసిగించడం మొదలుపెట్టాడు. ఆయన అలాగే చేస్తుంటాడులే అని వివేక్ అతడి గురించి పట్టించుకోవడం మానేశారు. దీంతో రాజసింహ.. వివేక్ ఫొటోని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి.. ఆయన పరువు తీసే రాతలు రాయడం మొదలు పెట్టాడు. ఇది తెలిసిన వివేక్.. ఇక లాభం లేదనుకుని పోలీసులను సంప్రదించారు. ఈ రాజసింహ అనే అతను గతంలో కె. రాఘవేంద్రరావు, వైవిఎస్ చౌదరి, ఠాగూర్ మధు వంటి వారి విషయంలో కూడా ఇలాగే చేసినట్లుగా ఈ ఫిర్యాదులో వివేక్ తెలిపారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి.. రాజసింహని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజసింహ తడినాడ విషయానికి వస్తే.. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘రుద్రమదేవి’ చిత్రానికి డైలాగ్ రైటర్‌గా పనిచేశారు. దాదాపు 60కి పైగా చిత్రాలకు ఆయన రచయితగా పనిచేసినట్లుగా తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

====================

*‘హను-మాన్’కు థియేటర్లు ఇవ్వని వారిపై TFPC సీరియస్

***********************

*Guntur Kaaram: ‘గుంటూరు కారం’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఇది, మహేష్ బాబు స్టామినా!

**************************

*Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆ అప్డేట్ కూడా వచ్చేసింది

************************

*‘హను-మాన్’ రెస్పాన్స్ చూసి.. గూస్ బంప్స్ వస్తున్నాయట..

************************

Updated Date - Jan 13 , 2024 | 06:29 PM