‘హను-మాన్’ రెస్పాన్స్ చూసి.. గూస్ బంప్స్ వస్తున్నాయట..

ABN , Publish Date - Jan 13 , 2024 | 01:36 PM

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమాని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా ఘన విజయం దిశగా దూసుకెళుతోంది. ఈ సినిమా రెస్పాన్స్ చూసి గూస్‌బంప్స్ వచ్చాయని తెలిపింది హీరోయిన్ అమృత అయ్యర్.

‘హను-మాన్’ రెస్పాన్స్ చూసి.. గూస్ బంప్స్ వస్తున్నాయట..
Amritha Aiyer about HanuMan

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమాని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తూ ఘన విజయం దిశగా దూసుకెళుతోంది. ఈ నేపధ్యంలో చిత్రంలో హీరోయిన్‌గా నటించిన అమృత అయ్యర్ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.

ట్రైలర్‌లో మీరు కనిపించలేదు. కానీ సినిమాలో పుల్ లెంత్ రోల్‌లో వున్నారు.. ఎలా అనిపించింది?

దర్శకుడు ప్రశాంత్ వర్మ‌గారు ముందే ఈ విషయాన్ని చెప్పారు. అందుకే దాని గురించి పెద్దగా అలోచించలేదు. హనుమాన్ సినిమా ప్రేక్షకులు నచ్చాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నాం. మేము అనుకున్నట్లుగా ప్రేక్షకులు గొప్పగా అస్వాదిస్తున్నారు.. ఆదరిస్తున్నారు. ఆడియన్స్‌తో కలసి చూస్తున్నపుడు వాళ్ళ రెస్పాన్స్ చూస్తుంటే.. నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. (Heroine Amritha Aiyer Interview)

సినిమా విడుదలకు ముందు ఒత్తిడి ఫీలయ్యారా?

ప్రశాంత్ వర్మ గారు క్రియేటివ్ డైరెక్టర్. ఆయన అద్భుతంగా తీశారనే నమ్మకముంది. అయితే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఎక్జయిట్మెంట్ ఎక్కువైంది.

ఈ సినిమా చూసిన తర్వాత మీకు వచ్చిన కాంప్లీమెంట్స్ గురించి?

సినిమా చూసిన ప్రేక్షకులంతా చాలా గొప్పగా అభినందిస్తున్నారు. చాలా ప్రాధాన్యత వున్న పాత్రని చక్కగా చేశావని చెబుతుంటే చాలా ఆనందంగా వుంది.


Amritha-Aiyer-PIc.jpg

తేజ, వరలక్ష్మీ శరత్‌కుమార్‌లతో పని చేయడం ఎలా అనిపించింది?

తేజతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. తను చాలా మంచి నటుడు. తన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అలాగే వరలక్ష్మీ‌గారితో కలిసి పని చేయడం కూడా మంచి అనుభూతి. ఆమె నుంచి కూడా కొన్ని మెళకువలు నేర్చుకున్నాను. సెట్‌లో అందరినీ పరిశీలిస్తాను. ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవడానికి ఏదో ఒక విషయం ఉంటుంది. హనుమాన్ వెరీ మెమరబుల్ జర్నీ. ఈ జర్నీలో సహనంగా వుండటం నేర్చుకున్నాను. ఒక ఆర్టిస్ట్‌కి సహనం చాలా ముఖ్యం. (Amritha Aiyer about HanuMan Success)

ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?

నటనకు ఆస్కారం వుండే పాత్రలు చేయాలని వుంది. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అలాంటి పాత్రలు వచ్చినా చేయడానికి ఇష్టపడతాను. నా కెరీర్ పట్ల చాలా ఆనందంగా వుంది.

హనుమాన్ 2 ఉంటుందని ప్రశాంత్ గారు చెప్పారా?

లేదండీ. అందరితో కలసి స్క్రీన్‌పై చూసినప్పుడు చాలా సర్ ప్రైజ్ అయ్యాను.

నిర్మాత నిరంజన్ రెడ్డి గురించి?

నిరంజన్ రెడ్డిగారు చాలా గొప్పగా సపోర్ట్ చేశారు. ఎక్కడా రాజీపడకుండా ప్రతీది సమకూర్చారు. ఆయన నిర్మాణంలో పని చేయడం చాలా ఆనందంగా వుంది.

మీ లైఫ్‌లో సూపర్ హీరో ఎవరు?

అమ్మ నాన్న ( నవ్వుతూ)

నరేష్ సినిమా గురించి?

సినిమా మొదలైంది. అందులో నా పాత్రకు చాలా ప్రాధాన్యత వుంటుంది. త్వరలోనే ఆ సినిమా వివరాలు నిర్మాతలు చెబుతారు.


ఇవి కూడా చదవండి:

====================

*Saindhav: వెంకీ ‘సైంధవ్’ ట్విట్టర్ రివ్యూ.. నెటిజన్లు ఎలా రియాక్ట్ అవుతున్నారంటే..?

*************************

*King Nagarjuna: మహేష్‌తో కలిసి సినిమా చేస్తాను.. కానీ?

*************************

*Racharikam: ‘రాచరికం’లో అప్సరా రాణి ఎలా ఉందో చూశారా..

**************************

Updated Date - Jan 13 , 2024 | 01:36 PM