Guntur Kaaram: ‘గుంటూరు కారం’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఇది, మహేష్ బాబు స్టామినా!

ABN , Publish Date - Jan 13 , 2024 | 02:57 PM

సంక్రాంతి స్పెషల్‌గా వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘గుంటూరు కారం’ బాక్సాఫీస్‌పై కలెక్షన్ల తాండవం చేస్తోంది. ఫస్ట్ డే ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ కొట్టి.. ఇది మహేష్ బాబు స్టామినా అని నిరూపించుకుంది. సినిమా విడుదలైన రోజు కావాలని కొందరు నెగిటివ్ టాక్ ప్రచారం చేసినా.. ఆ ఎఫెక్ట్ కలెక్షన్లపై ఎక్కడా కనిపించలేదు. ఫస్ట్ డే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 94 కోట్ల గ్రాస్‌ని రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఇది, మహేష్ బాబు స్టామినా!
Mahesh Babu In Guntur Kaaram

సంక్రాంతి స్పెషల్‌గా శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) సినిమా ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) బాక్సాఫీస్‌పై కలెక్షన్ల తాండవం చేస్తోంది. ఫస్ట్ డే ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ (All Time Record) కొట్టి.. ఇది మహేష్ బాబు స్టామినా అని నిరూపించుకుంది. సినిమా విడుదలైన రోజు కావాలని కొందరు నెగిటివ్ టాక్ ప్రచారం చేసినా.. ఆ ఎఫెక్ట్ కలెక్షన్లపై ఎక్కడా కనిపించలేదు. ‘గుంటూరు కారం’ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 94 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ కొట్టిన రీజనల్ ఫిల్మ్‌గా హిస్టరీ క్రియేట్ చేసింది. ఫస్ట్ డే కలెక్షన్లతో చిత్రయూనిట్ అధికారికంగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

వాస్తవానికి ‘గుంటూరు కారం’ మొదటి రోజు సోషల్ మీడియాలో భారీగా నెగిటివ్ ప్రచారం చేశారు. కొందరు ఈ సినిమాని ‘అజ్ఞాతవాసి’తో పోల్చారు. అయితే ‘అజ్ఞాతవాసి’ సినిమా ఫస్ట్ టాక్ అనంతరం భారీగా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. కానీ ‘గుంటూరు కారం’ సినిమా మాత్రం కలెక్షన్ల విషయంలో తగ్గేదే లే అన్నట్లుగా దూసుకెళుతోంది. రెండో రోజు ‘హనుమాన్’, ‘సైంధవ్’ రూపంలో పోటీ ఉన్నప్పటికీ అన్ని చోట్లా ‘గుంటూరు కారం’ సినిమాకు హౌస్‌ఫుల్ బోర్డులు ప్రత్యక్షమవుతున్నాయి. టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద సూపర్‌స్టార్ రాంపేజ్ కనబడుతోంది. మహేష్ కెరీర్‌లో మొదటి రోజు హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగానూ ‘గుంటూరు కారం’ రికార్డ్ క్రియేట్ చేసింది. (Guntur Kaaram First Day Collections)


Mahesh.jpg

ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు సినిమాలో ఉండటం.. మహేష్ బాబు, శ్రీలీలల ఊర మాస్ స్టెప్స్.. మహేష్ బాబుని సరికొత్తగా ప్రజంట్ చేసిన తీరు ప్రేక్షకులకు బాగా ఎక్కేస్తోంది. పండగ పూర్తయ్యే టైమ్‌కే ఈ సినిమా బ్రేకివెన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమాకు తిరుగులేదు అనేలా కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఫైనల్‌గా బాక్సాఫీస్‌ని ఈ సినిమా ఎలా మడతపెట్టబోతుందో తెలియాలంటే.. ఈ పండగ పూర్తయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.


ఇవి కూడా చదవండి:

====================

*Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆ అప్డేట్ కూడా వచ్చేసింది

************************

*‘హను-మాన్’ రెస్పాన్స్ చూసి.. గూస్ బంప్స్ వస్తున్నాయట..

************************

*Saindhav: వెంకీ ‘సైంధవ్’ ట్విట్టర్ రివ్యూ.. నెటిజన్లు ఎలా రియాక్ట్ అవుతున్నారంటే..?

*************************

Updated Date - Jan 13 , 2024 | 02:57 PM