‘హను-మాన్’కు థియేటర్లు ఇవ్వని వారిపై TFPC సీరియస్

ABN , Publish Date - Jan 13 , 2024 | 04:23 PM

శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ‘హను-మాన్’ సినిమాను కొన్ని థియేటర్లలో ప్రదర్శన చేయలేదు. ‘సలార్’ సినిమా ఆడుతోన్న కొన్ని థియేటర్లను ముందుగానే ‘హను-మాన్’ కోసం అగ్రిమెంట్ చేసుకున్న తెలంగాణలోని కొన్ని థియేటర్ల వారు.. ఆ అగ్రిమెంట్‌ని భేఖాతరు చేస్తూ.. ఆ సినిమాను ప్రదర్శించకపోవడంతో.. సదరు థియేటర్ల యాజమాన్యాలపై తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సీరియస్ అయింది.

‘హను-మాన్’కు థియేటర్లు ఇవ్వని వారిపై TFPC సీరియస్
Hanu Man Movie Still

శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ‘హను-మాన్’ సినిమాను కొన్ని థియేటర్లలో ప్రదర్శన చేయలేదు. ‘సలార్’ సినిమా ఆడుతోన్న కొన్ని థియేటర్లను ముందుగానే ‘హను-మాన్’ కోసం అగ్రిమెంట్ చేసుకున్న తెలంగాణలోని కొన్ని థియేటర్ల వారు.. ఆ అగ్రిమెంట్‌ని భేఖాతరు చేస్తూ.. ఆ సినిమాను ప్రదర్శించకపోవడంతో.. సదరు థియేటర్ల యాజమాన్యాలపై తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సీరియస్ అయింది. ఇది మంచి పద్దతి కాదని, వెంటనే ఆయా థియేటర్లలో ‘హను-మాన్’ సినిమాను ప్రదర్శించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధికారికంగా ఓ లేఖను విడుదల చేసింది. అందులో..

‘‘మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ LLP వారు ‘హనుమాన్’ సినిమా 12-01-2024 నుండి ప్రదర్శన కొరకు తెలంగాణాలో కొన్ని థియేటర్ల వారితో అగ్రిమెంటు చేయడం జరిగింది. కానీ ఆ థియేటర్ల వారు ఈ అగ్రమెంటు‌ను బేఖాతరు చేస్తూ నైజాం ఏరియా థియేటర్ల‌లో ఈ సినిమా ప్రదర్శన చేయలేదు. దీని విషయమై మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ మరియు నిర్మాత నిరంజన్ రెడ్డి గార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. థియేటర్లు అగ్రిమెంటు ప్రకారం ‘హనుమాన్’ సినిమా ప్రదర్శన చేయకపోవడం వలన డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు అపార నష్టం జరిగింది. కాబట్టి ఈ థియేటర్లు వెంటనే ‘హనుమాన్’ సినిమా ప్రదర్శనను ప్రారంభించడంతో పాటు ఇప్పటి వరకు జరిగిన నష్టం భరించాలి.


TFPC.jpg

థియేటర్ల వారి ఇటువంటి చర్యల వలన తెలుగు సినిమా పరిశ్రమ మనుగడకే ప్రమాదం. థియేటర్లు వారు చేసిన ఈ చర్యను తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తీవ్రంగా ఖండిస్తూ మరియు ఇటువంటి అనైతిక చర్యలను నిరసిస్తూ.. నమ్మకం, నైతికత, నిబద్దత, న్యాయం ఆధారంగా ముందుకు నడిచే యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ న్యాయానికి విరుద్ధంగా వ్యవహరించిన సదరు ప్రదర్శకులు వారి పూర్వ ఒప్పందాన్ని గౌరవిస్తూ ‘హనుమాన్’ సినిమాకి సత్వర న్యాయం చేయాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కోరుచున్నది..’’ అని తెలియజేశారు.


ఇవి కూడా చదవండి:

====================

*Guntur Kaaram: ‘గుంటూరు కారం’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఇది, మహేష్ బాబు స్టామినా!

**************************

*Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆ అప్డేట్ కూడా వచ్చేసింది

************************

*‘హను-మాన్’ రెస్పాన్స్ చూసి.. గూస్ బంప్స్ వస్తున్నాయట..

************************

Updated Date - Jan 13 , 2024 | 04:32 PM