Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆ అప్డేట్ కూడా వచ్చేసింది

ABN , Publish Date - Jan 13 , 2024 | 02:13 PM

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కి మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. శుక్రవారం ప్రభాస్ నటిస్తోన్న పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి 2898AD’ విడుదల తేదీని.. ఆ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. శనివారం ప్రభాస్ నటిస్తోన్న మరో సినిమాకు సంబంధించిన అప్డేట్ వదిలి.. ఈ రెబల్‌స్టార్ పేరు ట్రెండ్ అయ్యేలా చేశారు మేకర్స్. సంక్రాంతి రోజు ప్రభాస్, మారుతి కాంబో ఫిల్మ్ నుండి ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ రాబోతోంది.

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆ అప్డేట్ కూడా వచ్చేసింది
Prabhas and Maruthi Combo Film Update

రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) ఫ్యాన్స్‌కి మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. శుక్రవారం ప్రభాస్ నటిస్తోన్న పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి 2898AD’ విడుదల తేదీని.. ఆ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. శనివారం ప్రభాస్ నటిస్తోన్న మరో సినిమాకు సంబంధించిన అప్డేట్ వదిలి.. ఈ రెబల్‌స్టార్ పేరు ట్రెండ్ అయ్యేలా చేశారు మేకర్స్. ఏంటా అప్డేట్ అనుకుంటున్నారా? ప్రభాస్-మారుతి కాంబినేషన్‌లో (Prabhas and Maruthi Combo) రూపుదిద్దుకుంటోన్న సినిమా అప్డేట్ ఇది. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్‌ను సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్లుగా రీసెంట్‌గా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఫస్ట్ లుక్, టైటిల్ ఎప్పుడు వచ్చేదీ మేకర్స్ ప్రకటించారు.

సంక్రాంతి రోజు ఉదయించే సూర్యుడితో పాటు.. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా డబుల్ ట్రీట్‌తో సిద్ధమవుతున్నాడని తెలుపుతూ.. ఈ చిత్ర ఫస్ట్ లుక్, టైటిల్‌ను సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 15న ఉదయం 7గంటల 08 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. ఈ టైమ్‌ని తెలిపేందుకు సింబాలిక్‌గా కోడిపుంజు కూస్తున్న పోస్టర్‌ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ అప్డేట్‌తో ప్రభాస్ పేరు టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఇప్పటి వరకు కనిపించని ఓ కొత్త లుక్‌లో, క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడని మేకర్స్ చెబుతున్నారు. (#PrabhasMaruthi)


Maruthi.jpg

ఈ ప్రెస్టీజీయస్ ప్రాజెక్ట్‌ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటిగా మారిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) నిర్మిస్తోంది. టాలీవుడ్‌కు ‘భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజు పండగే’ వంటి విజయవంతమైన చిత్రాలను ఇచ్చిన డైరెక్టర్ మారుతి.. ఇందులో ప్రభాస్‌ను సరికొత్తగా సిల్వర్ స్క్రీన్‌పై ప్రెజెంట్ చేస్తాడనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది. డార్లింగ్ ఫ్యాన్స్‌కు ఒక స్పెషల్ మూవీ ఇవ్వాలనే స్ట్రాంగ్ కన్విక్షన్‌తో ఈ ప్రాజెక్ట్ కోసం మారుతి పనిచేస్తున్నారు. ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూఛిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*‘హను-మాన్’ రెస్పాన్స్ చూసి.. గూస్ బంప్స్ వస్తున్నాయట..

************************

*Saindhav: వెంకీ ‘సైంధవ్’ ట్విట్టర్ రివ్యూ.. నెటిజన్లు ఎలా రియాక్ట్ అవుతున్నారంటే..?

*************************

*King Nagarjuna: మహేష్‌తో కలిసి సినిమా చేస్తాను.. కానీ?

*************************

Updated Date - Jan 13 , 2024 | 02:13 PM