Gaami: జీ5లో దుమ్మురేపుతోన్న ‘గామి’.. మూడు రోజులలోనే రికార్డ్స్

ABN , Publish Date - Apr 16 , 2024 | 02:00 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధానపాత్రలో నటించిన ‘గామి’ చిత్రం జీ5 ఓటీటీలో దుమ్మురేపుతోంది. మార్చి 8న థియేటర్స్‌లో విడుదలై.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలోనూ అదే ఆదరణను రాబట్టుకుంటూ.. కేవలం 72 గంటల్లోపే 50 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ రాబట్టుకోవటం విశేషం. ఏప్రిల్ 12 నుంచి జీ5 ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

Gaami: జీ5లో దుమ్మురేపుతోన్న ‘గామి’.. మూడు రోజులలోనే రికార్డ్స్
Gaami Movie Poster

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Mass ka Dass Vishwak Sen) ప్రధానపాత్రలో నటించిన ‘గామి’ (Gaami) చిత్రం జీ5 (Zee5) ఓటీటీలో దుమ్మురేపుతోంది. విశ్వక్ సేన్ కెరీర్‌లోనే వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. విధ్యాధర్ కాగిత (Vidyadhar Kagita) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 8న థియేటర్స్‌లో విడుదలై.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలోనూ అదే ఆదరణను రాబట్టుకుంటూ.. కేవలం 72 గంటల్లోపే 50 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ (50 Million Streaming Minutes in 72 Hours) రాబట్టుకోవటం విశేషం. ఏప్రిల్ 12 నుంచి జీ5 ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. జీ5 ఓటీటీలో ఈ చిత్రానికి వస్తున్న స్పందన చూసిన మేకర్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. (Gaami Roars on ZEE5)

ఈ సినిమా కథ విషయానికి వస్తే (Gaami Movie Story).. హరిద్వార్‌లో ఉండే అఘోరా శంకర్ (విశ్వక్ సేన్) ఓ వింత సమస్యతో బాధపడుతుంటాడు. అందుకనే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లడు. శంకర్‌కి ఉన్న ఈ వ్యాధికి మందు హిమాలయాల్లోని త్రివేణి సంగమం దగ్గర ఉంటుందని, ఆ ఔషధం తీసుకుంటే శంకర్ వ్యాధి నయమవుతుందని స్వామీజీ చెప్తాడు. ఈ మొక్క కూడా 35 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని.. ఆ సమయంలోనే ఆ మొక్కని తీసుకురావాలని చెప్తాడు. జాహ్నవి (చాందిని చౌదరి) ఒక డాక్టర్, రీసర్చ్ కోసం అదే ఔషధం కోసం ప్రయత్నం చేస్తుంది. శంకర్‌ని ఆ హిమాలయాలకి తీసుకువెళతానంటుంది. మరోవైపు దక్షిణ భారతదేశంలో ఒక గ్రామంలో దుర్గ అనే దేవదాసి తన కుమార్తె ఉమతో ఉంటుంది. ఆమెకు దేవదాసి నుండి తప్పించేస్తారు, కుమార్తెని దేవదాసిగా చేయాలని చూస్తారు. ఇంకోవైపు ఒక లేబరేటరీలో మనుషుల మీద వివిధ రకాలైన భయంకరమైన పరీక్షలు చేస్తూ ఉంటారు, అక్కడి నుండి ఒక అబ్బాయి తప్పించుకొని బయటపడతాడు. ఈ మూడు కథలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా జరుగుతూ ఉంటాయి. శంకర్‌కు ఆ ఔషధం తీసుకురావడంలో ఎదురైన పరిస్థితులు ఏంటి? చివరికి సాధించాడా? జాహ్నవి ఏమైంది? దేవదాసి కుమార్తె తప్పించుకొని ఎక్కడికి వెళ్లింది? బయటపడిన కుర్రాడు ఏమయ్యాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ‘గామి’ సినిమా చూడాల్సిందే.


Gaami.jpg

నరేశ్ కుమార్, స్వీకర్ అగస్తి సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో పాటు విశ్వనాథ్ రెడ్డి, ర్యాంపి నందిగాం సినిమాటోగ్రఫీ ఈ సినిమాను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాయి. చక్కటి ఎమోషన్స్‌తో ఎప్పుడు ఏం జరుగుతుందా? అనే ఆసక్తికరమైన కథనం, విజువల్స్ ప్రేక్షకులని మెప్పిస్తున్నాయి. ఈ విజువల్, ఎమోషనల్ వండర్‌ని ఇంకా చూడని వారు.. ఇప్పుడే జీ5 ద్వారా వీక్షించవచ్చు. (Gaami in Zee5)


ఇవి కూడా చదవండి:

====================

*Pushpa 2 The Rule: 138 గంట‌ల‌పాటు ట్రెండింగ్‌లో.. సరికొత్త రికార్డ్

*********************************

*Manjummel Boys: తెలుగు వెర్షన్ ప్రదర్శనలను నిలిపేసిన పీవీఆర్ మల్టిఫ్లెక్స్

**********************

Updated Date - Apr 16 , 2024 | 02:00 PM