ఘనంగా తమిళ దర్శకుడు శంకర్‌ కుమార్తె వివాహం

ABN , Publish Date - Apr 16 , 2024 | 03:29 AM

ప్రముఖ దర్శకుడు ఎస్‌.శంకర్‌ - ఈశ్వరీ శంకర్‌ల కుమార్తె ఐశ్వర్య వివాహం తరుణ్‌ కార్తికేయన్‌తో జరిగింది. సోమవారం చెన్నైలో జరిగిన ఈ వివాహ వేడుకలో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్‌ హాజరై...

ఘనంగా తమిళ దర్శకుడు శంకర్‌ కుమార్తె వివాహం

ప్రముఖ దర్శకుడు ఎస్‌.శంకర్‌ - ఈశ్వరీ శంకర్‌ల కుమార్తె ఐశ్వర్య వివాహం తరుణ్‌ కార్తికేయన్‌తో జరిగింది. సోమవారం చెన్నైలో జరిగిన ఈ వివాహ వేడుకలో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్‌ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే చలన చిత్ర ప్రముఖులు రజినీకాంత్‌, కమల్‌ హాసన్‌, సూర్య, కార్తి, విక్రమ్‌, విశాల్‌, అర్జున్‌, కీర్తి సురేశ్‌, దర్శకులు భారతీరాజా, మణిరత్నం - సుహాసిని దంపతులు, కె.భాగ్యరాజ్‌, పి.వాసు, కేఎస్‌ రవికుమార్‌, హరి, విష్ణువర్ధన్‌, విఘ్నేష్‌ శివన్‌ - నయనతార దంపతులు, నిర్మాతలు ఆర్బీ చౌదరి, జయంతిలాల్‌ గడ, ఏఎం రత్నం, దిల్‌ రాజు, ఐసరి కె.గణేశ్‌ తదితరులు హాజరయ్యారు.

చెన్నై (ఆంధ్రజ్యోతి)

Updated Date - Apr 16 , 2024 | 12:44 PM