100 days... Rs. One hundred crores : 100 రోజులు... రూ. వంద కోట్లు

ABN , Publish Date - Apr 16 , 2024 | 03:39 AM

క్రికెట్‌లో సెంచరీ కొడితే ఆ ఆటగాడికి చెప్పలేనంత క్రేజ్‌.. ఫ్యాన్స్‌, మీడియా అతన్ని ఆకాశానికి ఎత్తేస్తాయి. అలాగే ఓ సినిమా రూ. వంద కోట్లు కలెక్ట్‌ చేస్తే ఆ చిత్ర బృందానికి వచ్చే కిక్కే వేరు. క్రికెట్‌లో ఆటగాడు సెంచరీ కొట్టాలంటే అది అతని ఒక్కడితోనే అయ్యే పని....

100 days... Rs. One hundred crores : 100 రోజులు... రూ. వంద కోట్లు

క్రికెట్‌లో సెంచరీ కొడితే ఆ ఆటగాడికి చెప్పలేనంత క్రేజ్‌.. ఫ్యాన్స్‌, మీడియా అతన్ని ఆకాశానికి ఎత్తేస్తాయి. అలాగే ఓ సినిమా రూ. వంద కోట్లు కలెక్ట్‌ చేస్తే ఆ చిత్ర బృందానికి వచ్చే కిక్కే వేరు. క్రికెట్‌లో ఆటగాడు సెంచరీ కొట్టాలంటే అది అతని ఒక్కడితోనే అయ్యే పని. కానీ సినిమా విషయం అలా కాదు. అది రూ.. వంద కోట్ల మైలురాయి చేరాలంటే దాని వెనుక చిత్ర బృందం కఠోర శ్రమ దాగి ఉంటుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ గడిచిన వంద రోజుల్లో ఈ డ్రీమ్‌ టార్గెట్‌ను అందుకున్న దక్షిణాది సినిమాల వివరాలు ఇవీ.

8 కలెక్షన్ల సునామీ ‘హను-మాన్‌’

కలెక్షన్ల సునామీ సృష్టించాలంటే పెద్ద హీరోల చిత్రాలే అయ్యుండాలనేది తెలుగులో ట్రేడ్‌ వర్గాల నమ్మకం. అందుకోసమే ఓ సినిమా రూ. వంద కోట్టు సాధించడం కోసం ఏవేవో లెక్కలు వేసుకుంటూ ఉంటారు మేకర్స్‌. కానీ ఒక్కసారిగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ..టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద వంద కోట్లు సాధించాలంటే భారీ తారాగణం, క్రేజీ కాంబినేషన్స్‌ అవసరం లేదని, కంటెంట్‌ బలంగా ఉండాలని నిరూపించిన సినిమా ‘హను-మాన్‌’. ఎటువంటి స్టార్‌ కాస్టింగ్‌ లేకుండా కేవలం రూ. 40 బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 330 కోట్లు కలెక్ట్‌ చేసి పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటింది. ఒక్క హిట్‌తో ఎన్నో రికార్డ్స్‌తో పాటు అనేక టాలీవుడ్‌ సెంటిమెంట్స్‌ను కూడా బ్రేక్‌ చేసింది. తేజ సజ్జా, అమృత అయ్యర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్‌ వర్మ దర్శకుడు. అతనికి సినిమాటిక్‌ యూనివర్స్‌లో ఇది మొదటి చిత్రం. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్‌’ చిత్రం వస్తోంది. ఇందులో హనుమంతుడి, రాముడి పాత్రలకు స్టార్‌ హీరోలను ఎంచుకుంటామని చిత్ర బృందం ప్రకటించింది. ఆ నటుల పేర్లలో మెగాస్టార్‌ చిరంజీవి, మహేశ్‌బాబు పేర్లు కూడా వినిపించడం విశేషం. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతున్న ఈ సినిమా మరెన్ని రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.

8 ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిన కాంబో

మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ కలయికలో వచ్చిన మొదటి చిత్రం ‘అతడు’. ఇప్పటికీ ఎవరూ ఈ చిత్రం చేసిన మ్యాజిక్‌ను మర్చిపోలేదు. ఆ తర్వాత వీరి కలయికలో వచ్చిన ‘ఖలేజా’ అంతగా ఆకట్టుకోకపోయినా..సరికొత్త మహేశ్‌బాబును ప్రేక్షకులకు పరిచయం చేసింది. దాదాపు 15 ఏళ్ల విరామం తర్వాత వీరి కలయికలో వచ్చిన మూడో చిత్రం ‘గుంటూరు కారం’. భారీ బడ్జెట్‌తో సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర రూ. 171 కోట్లు కలెక్ట్‌ చేసింది. మహేశ్‌, త్రివిక్రమ్‌ కాంబో నుంచి ఎటువంటి ఎంటర్టైన్‌మెంట్‌ను ఆశిస్తారో సరిగ్గా అలాంటి వినోదాన్నే పంచిన ఈ చిత్రం, మహేశ్‌ అభిమానులను ఖుషీ చేసింది.

8 సీక్వెల్‌తో టిల్లు మ్యాజిక్‌

‘డీజే టిల్లు’గా సిద్ధు జొన్నలగడ్డ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుని బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందీ చిత్రం. రిలీజై రెండేళ్లయినా ఇప్పటికీ ఈ చిత్రంలోని డైలాగ్స్‌, పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. అలా ఎంటర్టైన్‌మెంట్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిల్చిపోయింది టిల్లు పాత్ర. ‘అట్లుందది మనతోని’ అని మొదటి పార్ట్‌ అందించిన వినోదానికి కొనసాగింపుగా వచ్చిన రెండో భాగం ‘టిల్లు స్క్వేర్‌’. సిద్ధు మార్క్‌ డైలాగ్స్‌, మేనరిజమ్స్‌తో పాటు అనుపమ గ్లామర్‌ ఈ సినిమాకు స్పెషల్‌ అస్సెట్‌గా నిలిచాయి. రీసెంట్‌గా విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. వంద కోట్ల కలెక్షన్‌ను సాధించిందని ట్రేడ్‌ పండితులు అంటున్నారు.

8 చరిత్ర సృష్టించిన ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’

ఇక మలయాళ చిత్రాల విషయానికి వస్తే.. అక్కడి లేటెస్ట్‌ సెన్సేషన్‌ ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’. మలయాళ బాక్సాఫీస్‌ వద్ద 200 కోట్లు కలెక్ట్‌ చేసిన మొట్టమొదటి సినిమాగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. తమిళనాడులోని గుణ కేవ్స్‌లో జరిగిన ఓ వాస్తవ సంఘటన స్ఫూర్తితో చిదంబరం ఎస్‌ పొదువల్‌ దీనిని తెరకెక్కించారు. విమర్శకుల ప్రశంసలతో పాటు ఇండస్ట్రీ ప్రముఖుల మనసులనూ ఈ చిత్రం గెలుచుకుంది. ఇటీవలే ఈ చిత్రం తెలుగు డబ్బింగ్‌ విడుదలై హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది.

8 ‘ప్రేమలు’

దిగ్గజ దర్శకుడు రాజమౌళి దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన గిరీశ్‌ ఏ డి ‘ప్రేమలు’ చిత్రాన్ని తెరకెక్కించారు. మలయాళం బాక్సాఫీస్‌ దగ్గర రొమాంటిక్‌ కామెడీగా విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌ టాక్‌ను తెచ్చుకుని దాదాపు రూ. 130 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా కథలోని కీలక భాగం హైదరాబాద్‌లో జరగడంతో ఈ సినిమాను తెలుగులోనూ డబ్‌ చేశారు. రాజమౌళి తనయుడు ఎస్‌ ఎస్‌ కార్తికేయ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహించారు. ఇందులో రీనూ రాయ్‌ పాత్రలో నటించిన నటి మమితా బైజు ఓవర్‌నైట్‌ స్టార్‌గా.. కుర్రకారు లేటెస్ట్‌ క్రష్‌గా మారింది. తెలుగు నిర్మాతల దృష్టి ఆమెపై పడింది.

8 సర్వైవల్‌ థ్రిల్లర్‌కు కాసుల పంట

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించిన సర్వైవల్‌ థ్రిల్లర్‌ ‘ది గోట్‌ లైఫ్‌: ఆడు జీవితం’. బ్లెస్సీ దర్శకత్వం వహించారు. 2008లో మలయాళం బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచిన రచయిత బెన్యయిన్‌ ‘ఆడుజీవితం’ పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దాదాపు రూ. 130 కోట్లను రాబట్టింది.

8 ‘కెప్టెన్‌ మిల్లర్‌’ హవా...

తమిళంలో కూడా రూ. వంద కోట్లు సాధించిన చిత్రం ఒకటి ఉంది. అది ‘కెప్టెన్‌ మిల్లర్‌’. ఽసినిమా సినిమాకు తను ఎంచుకునే పాత్రల్లో వైవిధ్యం ప్రదర్శించే నటుడు ధనుష్‌. నటించిన లేటెస్ట్‌ చిత్రం ఇది. సంక్రాంతికి తమిళనాట విడుదలైన ఈ చిత్రం రూ. 104 కోట్లు కలెక్ట్‌ చేసింది. అరుణ్‌ మాథేశ్వరన్‌ ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌కు దర్శకత్వం వహించారు. 1930లో బ్రిటీష్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఓ తెగకు నాయకుడిగా ధనుశ్‌ ఇందులో నటించారు.

Updated Date - Apr 16 , 2024 | 04:02 AM